జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం

Nov 29 2026 1:20 AM | Updated on Nov 29 2026 1:20 AM

ఒంగోలు సిటీ: సామాజిక సమానత్వం, మహిళా విద్యకు జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కొనియాడారు. ప్రముఖ సంఘ సంస్కర్త, విద్యావేత్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మాజీ జెడ్పీ చైర్మన్‌, పార్టీ సీఈసీ మెంబరు బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌లు మాదాసి వెంకయ్య, వైఎం ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావులతో కలిసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. మహిళలు విద్యావంతులైతేనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని విశ్వసించి మహిళా విద్యకు విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే కూడా బాలికల విద్య కోసం పాఠశాలలను స్థాపించి మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచారని పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా విద్యా రంగంలో అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేశారని పేర్కొన్నారు. పార్టీ ఒంగోలు నగర అద్యక్షుడు కఠారి శంకరరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే దేశంలోనే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. కులవివక్ష, అంటరానితనం, అస్పృశ్యత, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్తపట్నం జెడ్పీటీసీ లంకపోతు అంజిరెడ్డి, కార్పొరేటర్లు కావటి రవికుమార్‌, పల్నాటి రవీంద్రారెడ్డి, పార్టీ సంయుక్త కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్‌, బీసీ సెల్‌ టౌన్‌ అధ్యక్షుడు సుతారం శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ నాయకులు పిగిలి శ్రీనివాసరావు, రొండా అంజిరెడ్డి, గుడ్డల వెంకటేశ్వర్లు, ఆనం శ్రీనివాసరెడ్డి, మహిళా నాయకులు బైరెడ్డి అరుణ, రాజిరెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, మీరావాళి, చందోలు చెంచిరెడ్డి పాల్గొన్నారు.

అంటరానితనం, అస్పృశ్యత నిర్మూలనకు విశేష కృషి

మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబా పూలేతో కలిసి ఉద్యమం

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు,

దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement