ఓటు నిర్భయంగా వేయాలి | - | Sakshi
Sakshi News home page

ఓటు నిర్భయంగా వేయాలి

Nov 29 2026 1:20 AM | Updated on Nov 29 2026 1:20 AM

ఓటు నిర్భయంగా వేయాలి

బల్లికురవ:

పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలని ఓటర్లకు కలెక్టర్‌ రాజాబాబు సూచించారు. ఎన్నికల సిబ్బంది సమర్థంగా విధులు నిర్వహించాలని, పూర్తి సౌకర్యాలు ఉన్నాయో లేదో ముందుగానే ఎన్నికల సిబ్బంది పరిశీలించుకోవాలని కోరారు. శనివారం బల్లికురవ, సంతమాగులూరులోని ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ ప్రారంభం నుంచి కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీసీటీవీలు లేని కేంద్రాల్లో వీడియో గ్రాఫర్లను ఏర్పాటు చేయాలని ఎంపీడీవో తహసీల్దార్‌లను ఆదేశించారు. ఆర్వోలు ఏపీ ఎస్‌ఈసీ మొబైల్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకుని ఫలితాలు ప్రకటించిన తదుపరి అప్లోడ్‌ చేయాలన్నారు.

సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక గ్రామాల్లో సీసీటీవీ లైవ్‌ వీక్షణ ఉంటుందని కలెక్టర్‌ వివరించారు. పోలింగ్‌ సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. పరిశీలనలో ఆర్డీవో చంద్రశేఖర్‌ నాయుడు, ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలి

కలెక్టర్‌ రాజాబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement