అలుపెరగని పోరాటం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

అలుపెరగని పోరాటం చేద్దాం

Nov 20 2026 2:18 AM | Updated on Nov 20 2026 2:18 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం చైర్మన్‌ అభ్యర్థి ఎంపికపై ప్రజల్లో ఎక్కడా విమర్శలు లేవు పార్టీ అధిష్టానం సూచనల మేరకే బీసీ అభ్యర్థికి చైర్మన్‌సీటు చైర్మన్‌ అభ్యర్థితో పాటు, అన్ని వార్డుల్లోనూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయం సాధించాలి బుర్రా మధుసూదన్‌యాదవ్‌

కందుకూరు: మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల విజయం కోసం అవిశ్రాంతంగా శ్రమించాలని, ప్రతి ఓటర్‌ తలుపుతట్టి ఓట్లు అభ్యర్థించాలని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్‌ అభ్యర్థులతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలోని 40 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని, నేటి నుంచే వార్డుల్లో విస్త్రృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి అందించిన సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. పార్టీ అధిష్టానం సూచనలకు అనుగుణంగానే చైర్మన్‌ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వల్లూరి కోటేశ్వరరావును ఎంపిక చేశామని తెలిపారు. వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం అందించాలన్నదే వైఎస్సార్‌ సీపీ సిద్ధాంతమని, దీనిలో భాగంగానే నియోజకవర్గంలో మెజార్టీ జనాభాగా ఉన్నందునే బీసీ వర్గానికి చెందిన తనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిందన్నారు. అదే కోవలో ప్రస్తుతం బీసీ అభ్యర్థిని మున్సిపల్‌ చైర్మన్‌ రేసులో ఉంచామన్నారు. కౌన్సిలర్లుగా కూడా అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు పెద్దపీట వేశామని వివరించారు. వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి ఎంపికపై ప్రజల్లో ఎక్కడా విమర్శలు రావడం లేదని, అంతా సానుకూలత వ్యక్తమవుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ నాయకులకు భయం పట్టుకుని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు ఫోన్‌లు చేస్తున్నారన్నారు. అభివృద్ధి గొప్పగా చేశామని చెప్పుకునే వాళ్లు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు పోన్‌లు చేసి విత్‌డ్రాలు చేసుకోమని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. డబ్బులు, అధికారి, పోలీస్‌ వ్యవస్థ అన్ని చేతిలో ఉన్నా ప్రజాస్వామ్యయుతంగా పోరాడేందుకు టీడీపీ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు బలంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పోలింగ్‌ తేదీ వరకు ఎక్కడా వెనుకడుగు వేయకుండా ఇంటింటి ప్రచారం చేపట్టాలన్నారు. ప్రతి ఓటర్‌ని కలిసి వైఎస్సార్‌ సీపీని ఆదరించాలంటూ విజ్ఞప్తి చేయాలని, కౌన్సిలర్‌, చైర్మన్‌ అభ్యర్థులకు ఫ్యాన్‌గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్ధించాలన్నారు.

కష్టాన్ని నమ్ముకుని ఎన్నికల్లో పనిచేయాలని, అన్ని విధాల అభ్యర్థులకు తాను అండగా ఉంటానని బుర్రా భరోసానిచ్చారు.

అభ్యర్థులకు బీఫాంలు అందజేత

అనంతరం చైర్మన్‌ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావుతో పాటు, కౌన్సిలర్‌ అభ్యర్థులకు పార్టీ తరపున భీపారాలు బుర్రా అందజేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించాలని, అధికార పార్టీకి చెంపపెట్టులాంటి తీర్పును ప్రజలు ఇస్తారన ఆశాభావం వ్యక్తం చేశారు. అభ్యర్థులంతా గెలుపు అవకాశాలపై దృష్టి పెట్టాలని, అందరినీ సమన్వయం చేసుకుంటూ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement