జెడ్పీ చైర్మన్‌, వైస్‌ ౖచైర్మన్‌ ఎన్నికకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్మన్‌, వైస్‌ ౖచైర్మన్‌ ఎన్నికకు సర్వం సిద్ధం

Nov 20 2026 2:18 AM | Updated on Nov 20 2026 2:18 AM

నేడు కలెక్టర్‌ అధ్యక్షతన ప్రక్రియ ప్రారంభం ప్రస్తుతానికి కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక వాయిదా కోరం లేక కొత్తపట్నం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక వాయిదా వివరాలు వెల్లడించిన జెడ్పీ సీఈవో చిరంజీవి

ఒంగోలు సబర్బన్‌: జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నిక కోసం సర్వం సిద్ధం చేసినట్లు జెడ్పీ సీఈఓ చిరంజీవి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. మొత్తం 27 జెడ్పీటీసీలకు గాను కనీసం 14 మంది హాజరైతే చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక నిర్వహిస్తామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రాజాబాబు అధ్యక్షతన ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని, అనంతరం చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌గా ఎన్నికై న వారితో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతానికి కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక లేదని, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇద్దరు కోఆప్షన్‌ సభ్యుల కోసం ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షుల కోసం గురువారం ఎన్నిక నిర్వహించామని సీఈఓ చెప్పారు. కొత్తపట్నం మండలంలో కోరం లేని కారణంగా ఎన్నిక జరగలేదని, ఇక్కడ శుక్రవారం కోరం ఉంటే ఎన్నిక నిర్వహిస్తామన్నారు. మిగిలిన అన్ని మండలాలలో ఈ ఎన్నికలు పూర్తయ్యాయని, కానీ మండల స్థాయిలో కూడా కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరగలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement