ఎన్నికల ఇబ్బందులు తొలగించండి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఇబ్బందులు తొలగించండి

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు సమస్యలు ఎదుర్కొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సౌకర్యాలు కల్పించాలి డీఈఓకు విన్నవించిన ఫ్యాప్టో నాయకులు

ఒంగోలు సబర్బన్‌: ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారని ఉపాధ్యాయ సంఘం ఫ్యాప్టో ప్రకాశం జిల్లా కమిటీ జిల్లా విద్యా శాఖ అధికారికి వివరించారు. ఈ మేరకు జిల్లా కమిటీ నాయకులు మంగళవారం కలెక్టరేట్‌లోని డీఈఓ ఛాంబర్‌లో కలిసిన నాయకులు వినతిపత్రాన్ని అందించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనీస వసతులు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో స్పెషల్‌ కేటగిరీ ఉపాధ్యాయులకు, 60 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులు, గర్భిణులు, బాలింతలకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో డ్యూటీ చేసిన ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్‌ వెంటనే చెల్లించాలని కోరారు. ఉపాధ్యాయులు వాడుకునే సాధారణ సెలవులు మంజూరు చేయాలని, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందికి మరుసటి రోజు ఓడీ సౌకర్యం కల్పించాలని, ఎన్నికల సామగ్రి అప్పగించిన కేంద్రం నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ బస్సు సౌకర్యం కల్పించాలని విన్నవించారు. మెటీరియల్‌ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో కనీస వసతులైన మంచినీళ్లు, భోజన వసతి, కల్పించాలని, స్కూల్‌ లెవెల్‌ అబ్జర్వర్‌కు లోకల్‌లోనే విధులు కేటాయించాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో ప్రకాశం జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌ షేక్‌ అబ్దుల్‌ హై, బీ శేషారావు, జీ శివ శంకర్‌, ఫ్యాప్టో కమిటీ సభ్యులు కిలారి వెంకటేశ్వర్లు, చల్లా శ్రీనివాసులు, డీ మధు, వీ రవి, జీ ఉమామహేశ్వరి, ఎస్‌ వెంకటేశ్వర్లు, వై వెంకట్రావు, ఎన్‌ చిన్నస్వామి, పీ సుబ్బారావు, ఆదినారాయణ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement