అటవీ అమర వీరుల త్యాగం వెలకట్టలేనిది | - | Sakshi
Sakshi News home page

అటవీ అమర వీరుల త్యాగం వెలకట్టలేనిది

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

అటవీ అమర వీరుల త్యాగం వెలకట్టలేనిది

మార్కాపురం టౌన్‌: అటవీ అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని, అటవీ సంపదను కాపాడటంలో అటవీ శాఖ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమైనది ఎఫ్‌ఆర్‌ఓ పిచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డీఎఫ్‌ఓ కార్యాలయంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల సంరక్షణ కోసం, వన్యప్రాణుల పరిరక్షణ కోసం, ప్రకృతి సంపదను కాపాడటానికి తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరులందరికీ నివాళులర్పించారు. ఏఓ ఖాజా మొహి ద్దీన్‌, డీవైఆర్‌ఓ ఎ.నాగరాజు, ఫారెస్ట్‌ సిబ్బంది, ఎఫ్‌ఆర్‌ఓలు సుజాత, దుర్గాప్రసాద్‌, సూర్యనారాయణ, చంద్ర మౌళి రెడ్డి, శివశంకర్‌, ప్రసాదరెడ్డి, శ్రీనివాస్‌, సాయి కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement