తీర ప్రాంతాలపై తుఫాన్ ప్రభావం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సముద్ర అలలు 20–40 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం రాత్రి 8 నుంచి పెరిగిన గాలుల తీవ్రత ఒంగోలు సహా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం సిద్ధంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పునరావాస కేంద్రాల ఏర్పాటు
కొత్తపట్నం సముద్రతీరంలో ఎగసిపడుతున్న అలలు
ఒంగోలు సబర్బన్:
26 గ్రామాలపై ప్రభావం
జిల్లాలో తుఫాన్ ప్రభావం 26 గ్రామాలు, 72 ఆవాస ప్రాంతాలను అధికారులు గుర్తించారు. జిల్లాలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో రెండు పొకై ్లన్లు, 5 ట్రాక్టర్లను అందుబాటులో ఉంచారు. నవంబరు నెలకు సంబంధించిన రేషన్ సరుకులను చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. 1000 విద్యుత్ స్తంభాలను అందుబాటులో ఉంచారు.
సోమవారం మధ్యాహ్నం నుంచే ప్రభావం:
అతితీవ్ర తుఫాన్ మురసు ప్రభావం కందుకూరు నియోజకవర్గంలో సోమవారం మధ్యహ్నం నుంచి స్పష్టంగా కనిపించింది. తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. అలాగే బలమైన ఈదురు గాలులు కూడా మొదలు కావడంతో తుఫాన్ తీవ్రత కనిపించింది. సోమవారం సాయంత్రం వరకు కొంతమేర వర్షాలు కురిసినా ఆ తరువాత తెరపినిచ్చాయి. బలమైన ఈదురుగాలులు మాత్రం వీస్తూనే ఉన్నాయి. తుఫాన్ తీరానికి సమీపించే కొద్దీ గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రం 20 నుంచి 40 మీటర్లు ముందుకు రావడంతో పాటు, అలల తాకిడి పెరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. తీరం దాటే సమయంలో బీభత్సం సృష్టించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో అధికంగా ఉండే మామిడి, సపోట వంటి ఉద్యానపంటలతో పాటు, ఆక్వాకల్చర్ సాగుపై కూడా ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులపాటు అధిక వర్షాలు ఉంటే మాత్రం ఇప్పటికే విస్తారంగా సాగులో ఉన్న పొగాకు నారుమడులు దెబ్బతింటాయని రైతులు భయపడుతున్నారు.
తీరంలోనే మత్స్యకారులు:
సింగరాయకొండ మండలం పాకలలో సముద్రం 20 మీటర్లు ముందుకు రాగా, ఊళ్లపాలెం తీరంలో సముద్రం 40 మీటర్లు ముందుకు వచ్చింది. మత్స్యకారులు తమ బోట్లను తీరానికి దూరంగా భద్రపరచుకున్నారు. ఊళ్లపాలెం తీరంలో బోట్లను తీరానికి దూరంగా జరుపుకోగా వలలు భద్రపరచుకునే అవకాశం లేక బోట్లలోనే ఉంచుకున్నారు. మండలంలో మధ్యాహ్నం కొద్ది సేపు ఈదురు గాలులతో వర్షం కురిసింది. రాత్రి 8 గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెల్లెమ్మగారి పట్టపుపాలెంలోని తుఫాన్‌షెల్టర్, ఊళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తుఫాన్ రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని రిలీఫ్ సెంటర్లో 9 కుటుంబాలకు చెందిన 21 మందిని ఉంచారు. తీరప్రాంత గ్రామాలను జేసీ కల్పనాకుమారి, ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. 30 మందితో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఇళ్లల్లోంచి బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశామని తహశీల్దార్ రాజేష్ వివరించారు.
కొత్తపట్నం తీర ప్రాంతంలో మత్స్యకారులు బోట్లు, వలలు, ఇంజన్ సామగ్రి ఒడ్డుకు చేర్చుకున్నారు. సోమవారం ఉదయం నుంచి సముద్రం అలలు ఎగిసి పడుతున్నాయి. సాయంత్రం నుంచి ఉధృతంగా గాలులు వీస్తున్నాయి.
అతి భారీ వర్షాలు
కురిసే మండలాలు
అర్ధరాత్రి ఈదురు గాలులు,భారీ వర్షం
తుఫాన్ ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల రాత్రి 11 గంటల నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తూనే ఉంది. అర్ధరాత్రి 1 గంట వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. గాలుల ప్రభావానికి ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కు అంతరాయం కలిగింది. కందుకూరు, కొండపి నియోజకవర్గాల పరిధిలోని పాకల ఊళ్లపాలెం, ఉలవపాడు, కరేడు, కొత్తపట్నం సముద్రతీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.
ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు, జరుగుమల్లి,
కందుకూరు, సంతనూతలపాడు, మద్దిపాడు


