వైఎస్సార్‌ సీపీలోకి 40 కుటుంబాలు చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి 40 కుటుంబాలు చేరిక

Nov 3 2026 4:45 PM | Updated on Nov 3 2026 4:45 PM

చీమకుర్తి రూరల్‌: చీమకుర్తి మండలంలోని ఇలపావులూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ మందా ఏసోబు, ఆయన సోదరుడు మందా గోపి ఆధ్వర్యంలో 46 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరాయి. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి డాక్టర్‌ మేరుగు నాగార్జున సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, మేరుగు నాగార్జునలు మందా ఏసోబు, మందా గోపి, వారి అనుచరులు, కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, గాడిపర్తివారిపాలెం మాజీ సర్పంచ్‌ సుడిదెల సుబ్బారెడ్డి, కోనేటి వెంకటసుబ్బయ్య, పులి హరిబాబు, కోనేటి సుబ్బయ్య, పులి కోటేశ్వరరావు, జక్కా చిన్నమ్మాయి, పులి వాసు, వెంగారెడ్డి, సుబ్బారామిరెడ్డి, కావూరి శ్రీను, బోడిపాగా అఖిల్‌, కోనేటి చందు, రాంపతోటి యర్రయ్య, ఇలపావులూరు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement