పురపోరులో పోలీసులు, టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యాన్ని బజారుకీడ్చారు. గెలుపుపై నమ్మకం లేక ఓటర్లను భయపెట్టి, ప్రత్యర్థులను అడ్డుకుని, పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఓట్ల దోపిడీకి తెగబడ్డారు. వీరికి అధికారులు, పోలీసులు అ | - | Sakshi
Sakshi News home page

పురపోరులో పోలీసులు, టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యాన్ని బజారుకీడ్చారు. గెలుపుపై నమ్మకం లేక ఓటర్లను భయపెట్టి, ప్రత్యర్థులను అడ్డుకుని, పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఓట్ల దోపిడీకి తెగబడ్డారు. వీరికి అధికారులు, పోలీసులు అ

Nov 2 2026 2:35 AM | Updated on Nov 2 2026 2:35 AM

పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లపై పచ్చమూకల దాడులు ఏజెంట్‌ ఫారాలు చించి దౌర్జన్యం ఏకపక్షంగా బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడిన రౌడీమూకలు ఒంగోలు, చీమకుర్తి, గిద్దలూరు, మార్కాపురం, అద్దంకి మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్‌ ఒంగోలు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లపై అర్ధరాత్రి నుంచే పోలీసుల వేధింపులు, నిర్బంధం పలు కేంద్రాల్లో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌లు లేకుండానే టీడీపీ ఏజెంట్ల సమక్షంలో ఓట్లు వేయించిన అధికారులు ఇవేం ఎన్నికలంటూ మండిపడిన సాధారణ ఓటర్లు, వైఎస్సార్‌ సీపీ నాయకులు

నేతల హౌస్‌ అరెస్టులు:

● ప్రజాస్వామ్యంపై పచ్చమూకల దాడి ● పురపోరులో బరితెగించిన పచ్చ గూండాలు ● వంతపాడిన పోలీసులు

మార్కాపురంలో వైఎస్సార్‌ సీపీ మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ను నెట్టేస్తున్న పోలీసులు

చీమకుర్తి గాంధీ నగర్‌ లో వైఎస్సార్‌ సీపీ నాయకులను

బెదిరిస్తున్న పోలీసులు

ఒంగోలు రామ్‌నగర్‌ ఐసీడీఎస్‌ కార్యాలయంలోని పోలింగ్‌ కేంద్రం గేటు లోపల ఉండి ఓటర్లను ప్రభావితం చేస్తున్న టీడీపీ నాయకులు

దౌర్జన్యమే ఆయుధం..

ఓట్ల దోపిడీయే లక్ష్యం!

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పురపోరులో అధికార పార్టీ అరాచకమే రాజ్యమేలిందనడానికి ఉమ్మడి జిల్లాలో ఆదివారం జరిగిన పోలింగ్‌లో చోటుచేసుకున్న సంఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒంగోలు కార్పొరేషన్‌లో పోలింగ్‌ ముందు రోజు నుంచే రంగంలోకి దిగిన పోలీసులు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు, నాయకుల పట్ల దౌర్జన్యం, కుట్రపూరితంగా వ్యవహరించారు. శనివారం అర్ధరాత్రి 55వ డివిజన్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పల్నాటి రవీంద్రారెడ్డితో పాటు, ఏజెంట్‌లను తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. ఆదివారం పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు కూడా పోలీసులు అనుమతించలేదు. ఇదేం అన్యాయమంటూ చైర్మన్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌, పార్టీ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబులో స్టేషన్‌కు వెళ్లి తమ అభ్యర్థులను పోలీసులు నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వారిని వదిలిపెట్టేందుకు పోలీసులు నిరాకరించారు. అలాగే ఎన్నికలు ప్రారంభమైన కొద్దిసేపటికే పచ్చమూకలు రంగంలోకి దిగి బూత్‌లను ఆక్రమించే చర్యలకు దిగారు. 20వ డివిజన్‌ పరిధిలోని బాలాజీనగర్‌ కార్పొరేషన్‌లో స్కూల్‌లో ఏర్పాటు చేసిన బూత్‌లను అధికార పార్టీ ఏజెంట్లు పూర్తిగా ఆక్రమించారు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్ల పత్రాలను చించేయడంతో పాటు, వారిని బయటకు నెట్టివేశారు. ఏజెంట్‌ ఫారాలు చూపిస్తున్నా వారిని పోలీసులు లోపలికి పంపించలేదు. దీంతో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు లేకుండానే ఈ బూత్‌ల్లో పోలీసులు దగ్గర ఉండి మరీ అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించారు. అదే సందర్భంలో పదుల సంఖ్యలో టీడీపీ నాయకులు బూత్‌ల లోపలే ఉన్నా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. దీంతో మెజార్టీ పోలింగ్‌ బూత్‌ల్లో పచ్చమూకల కనుసన్నల్లోనే ఏకపక్షంగా ఓట్లు వేయించుకున్నారు. 12వ డివిజన్‌ చెరువుకొమ్ముపాలెం వైఎస్సార్‌ సీపీ నాయకుడు కృష్ణారెడ్డిని పోలీసులు అక్రమంగా అదుపుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులకు, వైఎస్సార్‌ సీపీ నాయకులు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తరువాత కృష్ణారెడ్డిని పోలీసులు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. సెయింట్‌ జేవియర్స్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థినే ఏకంగా పోలీసులు ఏకవచనంతో మాట్లాడుతూ నెట్టేశారు.

చీమకుర్తిలో పూర్తిగా రిగ్గింగ్‌...

చీమకుర్తి మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా టీడీపీ గూండాల ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించుకుని రోజంతా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పట్టణంలోని పాటిమీదపల్లె 28వ వార్డు వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై దాడి చేసి కొట్టారు. పోలీసులు మాత్రం వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అలాగే వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌లు లేకుండా పోలింగ్‌ నిర్వహించడంపై ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. జేసీ కల్పనాకుమారికి ఫిర్యాదు చేసి ఏజెంట్లను నియమిస్తేనే ఓట్లు వేస్తామని చెప్పడంతో మరో ఇద్దరిని ప్రత్యామ్నాయ ఏజెంట్లుగా ఆమె నియమించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో దౌర్జన్యపూరితంగా విజయం సాధించేందుకు పచ్చమూకలు బరితెగించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లపై దాడికి పాల్పడి అసభ్యకర పదజాలంతో దూషించి బటయకు పంపేశారు. దాదాపు 14 బూత్‌లను ఆక్రమించుకున్న రౌడీ మూకలు తమకు అడ్డేలేదన్న తరహాలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 14వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ భర్త బ్యాలెట్‌ పత్రాలు లాక్కొని మరీ బూత్‌లోకి దూరి రిగ్గింగ్‌కు చేశారు. దీనిపై ఆందోళనలకు దిగిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై విధుల్లో ఉన్న సీఐ శేషగిరి ఆధ్వర్యంలో లాఠీచార్జ్‌ చేసి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ రిగ్గింగ్‌ వ్యవహారరం మొత్తం అక్కడ ఉన్న ఎన్నికల అధికారులు, పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.

గిద్దలూరులో గూండాగిరి...

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే గెలవలేమనే అంచనాకు వచ్చిన టీడీపీ గిద్దలూరు మున్సిపల్‌ ఎన్నికల్లో గూండాయిజానికి పాల్పడింది. మధ్యహ్నం వరకు ఓమాదిరిగా జరిగిన పోలింగ్‌ సరళి ఆ తరువాత పచ్చమూకల చేతుల్లోకి వెళ్లింది. పట్టణంలోని 2వ వార్డు సెయింట్‌పాల్స్‌ కాలేజీ బూత్‌ల్లో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌లు అమీర్‌బాష, నర్సింహారెడ్డిలపై టీడీపీ నాయకులు దాడికి దిగారు. అలాగే శెట్టిపల్లి బూత్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ చంద్రశేఖర్‌పై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. యాదవబజార్‌లో గల జిల్లా పరిషత్‌ స్కూల్‌లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఓట్ల చోరీకి పాల్పడ్డారు. దీంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు, టీడీపీ మూకలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ వీరిపై దాడికి దిగి బయటకు నెట్టారు. పలు ప్రాంతాల్లోని బూత్‌లను ఆక్రమించుకున్న టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.

అద్దంకిలోను అరాచకం...

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సొంత నియోజకవర్గమైన అద్దంకిలో మున్సిపల్‌ ఎన్నికల్లోను టీడీపీ అరాచకాలకు తెగబడింది. పట్టణంలోని 30వ వార్డు పోలింగ్‌ బూత్‌ల్లో ప్రధాన ఏజెంట్‌ను పోలీసులు తీసుకెళ్లి, రిలీప్‌ ఏజెంట్‌ను కూర్చోబెట్టారు. దీనిపై వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కావాలనే ఏజెంట్‌లను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని వివరించారు. 31, 32వ వార్డుల పరిధిలో భారీగా దొంగ ఓట్లు నమోదవుతుండడంతో ఇన్‌చార్జ్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌ పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకుని నిలిపివేశారు. దీంతో అద్దంకిలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌లను బయటకు నెట్టివేసి, సీసీ కెమెరాలను తొలగించి అధికారుల అండతో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోను ఓట్లు వేసుకున్నారు.

మార్కాపురంలో టీడీపీ హల్‌చల్‌...

మార్కాపురం మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ నాయకులు హల్‌చల్‌ చేశారు. ఏకపక్షంగా బూత్‌లను ఆక్రమించుకుని ఇష్టారీతిన ఓట్లు వేసుకున్నారు. ఈ పరిమాణాలకు నిరసనగా మార్కాపురం వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ అన్నా రాంబాబు, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్ధిని సీహెచ్‌ కనకదుర్గ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. బూత్‌ల వద్ద వైఎస్సార్‌ సీపీ ఏజెంట్ల పట్ల దౌర్జన్యాలకు దిగి స్వేచ్ఛగా ఓట్లు వేసే వాతావరణం లేకుండా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ శ్రేణులు ఏకపక్షంగా ఓట్లను వేసుకున్నారంటూ వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

మార్కాపురం పోలీస్‌స్టేషన్‌ వద్ద నిరసన

తెలుపుతున్న అన్నా రాంబాబు, కనకదుర్గ

చీమకుర్తిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి

శివప్రసాద్‌ రెడ్డికి హౌస్‌ అరెస్టు నోటీసిస్తున్న ిసీఐ

ఒంగోలు సెయింట్‌ జేవియస్‌ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ను నెట్టేస్తున్న పోలీసులు

మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలను గృహ నిర్బంధాలు చేసిన పోలీసులు పోలింగ్‌లో అక్రమాలకు తమవంతు సహకారం అందించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని చీమకుర్తిలో గృహ నిర్బంధం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు అన్ని బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అలాగే అద్దంకి ఇన్‌చార్జి అశోక్‌బాబును బూత్‌లను పరిశీలించకుండా అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement