ఎస్టీ అభ్యర్థిపై దాష్టీకం.. | - | Sakshi
Sakshi News home page

ఎస్టీ అభ్యర్థిపై దాష్టీకం..

Nov 2 2026 2:35 AM | Updated on Nov 2 2026 2:35 AM

ఎస్టీ అభ్యర్థిపై దాష్టీకం..

చీమకుర్తిలో రీపోలింగ్‌కు వచ్చిన 14 వ పోలింగ్‌ బూత్‌లో అక్కడ పోటీ చేసిన గిరిజన (ఎరుకల) సామాజిక వర్గానికి చెందిన పేరం కోటేశ్వరిపై తెలుగుదేశం గుండాలు దాష్టీకానికి పాల్పడ్డారు. ఓటేసేందుకు వెళ్లిన ఆమె భర్తను టీడీపీ గుండాలు కింద పడేసి కొట్టడంతో, భయం అభ్యర్థి పరిగెత్తి పోయిన భయానక వాతావరణం నెలకొంది. అదే అదనుగా పోలింగ్‌ బూత్‌ను స్వాధీనం చేసుకొని పచ్చ గుండాలు యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేశారు. ఇక్కడ కౌన్సిలర్‌కు, చైర్మన్‌ అభ్యర్థి కంటే 50 ఓట్లు అధికంగా వచ్చాయి.ఆ పోలింగ్‌ పరిధిలో ఎక్కువ శాతం గిరిజన తెగకు చెందిన వారు ఉండటంతో, వారిని పోలింగ్‌కు రాకుండా బెదిరించి అడ్డుకున్నారు. సోమవారం జరిగే రీపోలింగ్‌లో గిరిజనులమైన తమకు స్వేచ్ఛగా ఓటు వేసుకుకొనే హక్కు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement