పోలీసుల కనుసన్నల్లో పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీసుల కనుసన్నల్లో పోలింగ్‌

Nov 2 2026 2:35 AM | Updated on Nov 2 2026 2:35 AM

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల పర్వం నుంచే అక్రమాలు, అరాచకాలకు తెరదీసిన అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న టీడీపీ.. పోలింగ్‌ రోజు కూడా అదే వైఖరిని కొనసాగించింది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించి ఇబ్బందులు పెట్టారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పును లెక్కచేయకుండా అక్రమాలకు పాల్పడ్డారు. కొన్ని కేంద్రాల్లో ఏజెంట్లను బయటకు నెట్టేసీ రిగ్గింగ్‌ చేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, ఏజెంట్లు, క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న వారి అనుచరులను అక్రమంగా అదుపులోకి తీసుకొని భయభ్రాంతులు సృష్టించారు. పోలింగ్‌ కేంద్రాలలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల తరుపున ఏజెంట్లు లేకుండా చేసి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన కుట్రలు చేశారు. కుయుక్తులు పన్నారు. మొత్తం మీద ఒంగోలు నగర పాలక సంస్థ ఎన్నికలు పోలీసుల కనుసన్నల్లో ప్రశాంతంగా జరిగినట్లు పోలీసు అధికారులు ప్రకటించుకున్నారు.

పోలీసుల అదుపులో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు

ఒంగోలు నగర కార్పొరేషన్‌ ఎన్నికల్లో 55వ డివిజన్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్నాటి రవీంద్రారెడ్డిని తాలుకా పోలీసులు ఆదివారం ఉదయం అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటుగా ఏజెంట్లను కూడా తీసుకెళ్లి తాలుకా పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టారు. కనీసం టిఫిన్‌ చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, ఓట్లు వేసుకునేందుకు వీల్లేకుండా చేశారు. ఎందుకు తీసుకొచ్చారంటే సమాధానం లేదు. కేవలం ఎన్నికల్లో రవీంద్రారెడ్డి విజయాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు అక్రమాలకు పాల్పడినట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. 9వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి చర్చిల్‌ గిఫ్ట్‌ని కూడా తీసుకెళ్లి పోలీసుస్టేషన్లో కూర్చోపెట్టారు. 12వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న డిపినేని సుబ్బులు కుమారుడు భాస్కర్‌ను రెండు రోజులుగా తాలుకా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అధికార పార్టీకి మద్దతు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. 60వ డివిజన్లో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను అర్ధరాత్రి అదుపులోకి తీసుకొన్నారు. 62వ డివిజన్‌లో రాములు అనే పెద్దాయనను పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి వేధించడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25, 57,58 డివిజన్లను పోలీసుల ద్వారా ఏకగ్రీవం చేసుకున్న టీడీపీ నాయకులు ఇప్పుడు ఆ డివిజన్లలో వైఎస్సార్‌ సీపీ తరుఫున మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌కు ఓట్లు పడకుండా రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ప్రచారం జరుగుతుంది.

ఎల్లో పోలీసుల బరితెగింపు...

పురపాలక ఎన్నికలలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు బరితెగించారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల పట్ల ఒక విధంగా, టీడీపీ అభ్యర్థుల పట్ల మరోవిధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు భూ కబ్జాలకు కేంద్రంగా తాలుకా పోలీసు స్టేషన్‌ మారిందని కూటమి నాయకులే పరస్పరం విమర్శలు చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు నగర పాలకసంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, ఏజెంట్ల అక్రమ అరెస్టులకు కేంద్రంగా మారిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఒక డీఎస్పీ, ఒక సీఐ ఓవరాక్షన్‌ చేయడంతో స్థానిక ప్రజలు విస్మయానికి గురయ్యారు. కొందరు కానిస్టేబుళ్లు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను, ఏజెంట్లను పట్టుకొని వెళ్లే పనిలో తలమునకలవడం కనిపించింది.

ఎక్కడికక్కడ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు,

ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, ఏజెంట్లతో కిటకిటలాడిన తాలుకా పోలీసుస్టేషన్‌

ఒంగోలు డీఎస్పీ రాయపాటి, తాలుకా సీఐ

విజయకృష్ణ ఓవరాక్షన్‌

గెలుస్తామన్న ధీమా లేకపోవడంతో

దొడ్డిదారిన ప్రయత్నాలు

పక్కా ప్రణాళికతో దొంగ ఓట్లు వేయించిన టీడీపీ అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement