దొంగ ఓటర్ల హల్‌చల్‌... | - | Sakshi
Sakshi News home page

దొంగ ఓటర్ల హల్‌చల్‌...

Nov 2 2026 2:35 AM | Updated on Nov 2 2026 2:35 AM

ఒంగోలు కార్పొరేషన్‌ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముఠాలను తీసుకొచ్చారు. కర్నూల్‌ రోడ్డులోని 53,54,55 డివిజన్‌ల పరిధిలోని సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లో బూత్‌ల్లో దొంగ ఓట్లు వేసేందుకు నెల్లూరు నుంచి 50 మందిని, ఇతర ప్రాంతాల నుంచి మరికొంత మందిని తీసుకొచ్చి బూత్‌ ఎదురు బిల్డింగ్‌లో ఉంచారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో వీరంతా దొంగ ఓట్లు వేసేందుకు ఒక్కసారిగా బూత్‌ వద్దకు వచ్చారు. అయితే వీరు ఆ ప్రాంతానికి చెందినవారు కాకపోవడంతో గుర్తించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు వారిని అడ్డుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ పీఏ అనిల్‌ బూత్‌ వద్దకు చేరుకుని నేరుగా బూత్‌లోకి వెళ్లాడు. దీనిపై అక్కడ ఉన్న వైఎస్సార్‌సీపీ మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇవేమీ పట్టించుకోని పోలీసులు, ఎన్నికల అధికారులు టీడీపీ నాయకులు, జనార్ధన్‌ పీఏని లోపలికి అనుమతించి దొంగ ఓట్లు వేసుకునేందుకు సహకరించారు. 45, 46వ డివిజన్‌ల పరిధిలోని కొడవలూరి సుబ్బారెడ్డి స్కూల్‌లోని బూత్‌ వద్ద దొంగ ఓటు వేసేందుకు ఓ యువతి ప్రయత్నించింది. ఇది గమనించిన వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌ను అభ్యంతరం చెప్పారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీన్ని తెలుసుకున్న కొండపి సీఐ వైవీ రమణయ్య అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. 14వ డివిజన్‌లోని ఏబీఎం స్కూల్‌ బూత్‌ వద్దకు నాలుగు కార్లలో వచ్చిన టీడీపీ మూకలు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిని అనిత వారిని గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్‌ సమయం ముగిసిన తరువాత కూడా 5.30 గంటల వరకు టీడీపీ శ్రేణులను బూత్‌లోకి అనుమతించి దొంగ ఓట్లు వేయించారు. గిద్దలూరు మున్సిపల్‌ ఎన్నికల్లోను దొంగ ఓట్లు యథేచ్ఛగా వేసుకున్నారు. గిద్దలూరు పట్టణంలోని ఏబీఎన్‌ పాలెంలో ఆదియేంద్ర స్కూల్‌ బూత్‌లో తన ఓటును ఎవరో వేశారంటూ ఓ యువకుడు ఆందోళనకు దిగాడు. అలాగే అద్దంకిలోని 31, 32వ వార్డుల పరిధిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేశారు.

ఒంగోలు గ్రంథాలయం పోలింగ్‌ బూత్‌ వద్దకు దొంగ ఓట్లు వేయించేందుకు టీడీపీ నాయకులు తీసుకొచ్చిన కాలేజి విద్యార్థులు

ఒంగోలు సెయింట్‌ థెరిస్సా హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం లోపల కూర్చొని మహిళతో, యువకుల తో దొంగ ఓట్లు వేయిస్తున్న మాజీ కార్పొరేటర్‌, టీడీపీ నాయకుడు పిచ్చక రమణయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement