అధికార పార్టీకి కొమ్ముకాసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి..! | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీకి కొమ్ముకాసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి..!

Nov 2 2026 2:35 AM | Updated on Nov 2 2026 2:35 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఓటమి భయంతో గిద్దలూరు మున్సిపాలిటీని కై వసం చేసుకునేందుకు కూటమి నేతలు పన్నిన కుయక్తులు అన్నీ ఇన్నీ కావు. ఎలాగైనా దొడ్డిదారిన గెలవాలని పచ్చ నేతలు వేసిన పథకాన్ని సాక్షి ముందే ఎండగట్టింది. సరిగ్గా సాక్షి ఎమైతే చెప్పిందో పోలింగ్‌ రోజున అదే నిజమైంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ..స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కనుసన్నల్లో రిగ్గింగ్‌ కుతంత్రం యథాతథంగా అమలైంది. ఎమ్మెల్యే సోదరుడు, కుమారుడు స్వయంగా రంగంలోకి దిగి చక్రం తిప్పగా..పోలీస్‌ యంత్రాంగం వారికి వత్తాసు పలుకుతూ పోలింగ్‌ కేంద్రాలను పచ్చ ముఠాలకు అప్పగించారు.

పోలీసుల కనుసన్నల్లోనే తతంగం..

శాంతిభద్రతలను కాపాడి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పోలీసు అధికారులు పచ్చ చొక్కాలు తొడుక్కున్నట్లు వ్యవహరించింది. అధికార పార్టీకి కొమ్ముకాసేలా బాధ్యతలు తీసుకున్న సీఐలు రిగ్గింగ్‌ ప్రక్రియకు అవకాశం కల్పించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను, నాయకులను పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉండనివ్వలేదు. పచ్చ రౌడీమూకలు యధేచ్చగా గుంపులు గుంపులుగా తిరుగుతున్న దొంగ ఓట్లు దగ్గరుండి వేయిస్తున్న పట్టించుకోలేదు.ఎమ్మెల్యే సోదరుడు, తనయుడు ఎన్నికల నిబంధనలను కాలరాస్తూ వార్డుల్లో మోహరించారు. ఉదయం నుంచే కార్లలో అనుచరులతో తిరుగుతూ పోలింగ్‌ బూత్‌లను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఎక్కడికక్కడ స్థానిక రౌడీమూకలను వెంటేసుకుని తిరుగుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఏ వార్డుల్లో వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం వచ్చే అవకాశం ఉందో పసిగట్టి ఆయా బూత్‌లను టార్గెట్‌ చేస్తూ పక్కా ప్రణాళికతో రిగ్గింగ్‌, రీసైక్లింగ్‌, దొంగ ఓట్లు వేయించారు. ప్రజాప్రనిధి కుటుంబ సభ్యులే ఇల్లా రోడ్లపై పడి బరితెగించి దౌర్జాన్యాలకు తెగబడటం పట్టణ ప్రజలను విస్మయానికి గురిచేసింది. గిద్దలూరు పీఎం శ్రీ జెడ్పీ బాలికల హైస్కూల్‌లో ఇరవై మంది అనుచరులతో ఎమ్మెల్యే సోదరుడు లోపలికి వెళ్లారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ భూమా నరసింహారెడ్డి అక్కడ ఉండటంతో పన్నాగం ఫలించలేదు. అక్కనే ఉన్న యాదవ బజార్‌లోని ఎంపీయూపాఠశాలలో 50 మంది అనుచరులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికి లాగిపడేశారు. చివరకు రౌడీమూకల దౌర్జాన్యానికి పోలీసులు వత్తాసు పలుకుతూ కొందరిని లోపలికి పంపారు. రెండు పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌ పాల్పడగా, పలు కేంద్రాల్లో దొంగ ఒట్లు, రీసైక్లింగ్‌ యథేచ్ఛగా జరుపుకున్నారు.

పోలీసుల కనుసన్నల్లోనే రిగ్గింగ్‌

పోలింగ్‌ కేంద్రాల్లో హల్‌చల్‌ చేసిన ఎమ్మెల్యే సోదరుడు, కుమారుడు

పోలీసుల పక్షపాత వైఖరిపై సర్వత్రా విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement