పోలింగ్ బూత్‌ల వద్ద స్వేచ్ఛాపూరిత వాతావరణం కల్పించాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్‌ను బూత్‌లను బయటకు నెట్టివేస్తున్నా పట్టించుకోని పోలీసులు, పచ్చమూకలను మాత్రం వందల సంఖ్యలో పోలింగ్ బూత్‌లోకి అనుమతించారు. మరోపక్క వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లకు తరలించి అరాచకానికి పాల్పడ్డారు. దీంతో పోలింగ్‌బూత్‌లను పూర్తిగా ఆక్రమించుకున్న టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. తాలూకా సీఐ విజయ్‌కృష్ణ, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీ శ్రేణులకు పూర్తిగా సహకారం అందించారు. ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ స్కూల్ బూత్‌ల వద్ద వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై దాడి చేయడంతో అది తెలుసుకున్న చైర్మన్ అభ్యర్థి కుప్పం ప్రసాద్ అక్కడికి చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఒంగోలు తాలూకా సీఐ విజయ్‌కృష్ణ పోలింగ్ ముందు రోజు నుంచే వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, ఏజెంట్‌లను స్టేషన్‌లో నిర్బంధించారు. బూత్‌లోకి వెళ్లడానికి వీలులేదంటూ బయటకు నెట్టివేశారు. చీమకుర్తిలోనూ చీమకుర్తిలో విధుల్లో ఉన్న సీఐ శేషగిరిరావు, చీమకుర్తి సీఐ ప్రసాద్, సంతనూతల పాడు ఎస్సై అజయ్‌బాబు పచ్చ గుండాల మాదిరిగా వ్యవహరించారు. 9, 10, 11, 12 ఇలా పలు బూత్‌లోని వైఎస్సార్ సీపీ ఏజెంట్‌లను పోలీసులు బయటకు పంపించి టీడీపీ నాయకులకు చెప్పిందే వేదంగా పనిచేశారు.అద్దంకి, గిద్దలూరు, మార్కాపురం, చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులే దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారు.


