● భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా పోలింగ్
చీమకుర్తి రూరల్: చీమకుర్తి మున్సిపాలిటీలోని 14వ వార్డులో సోమవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య రీ పోలింగ్ నిర్వహించారు. ఆదివారం జరిగిన అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. 14వ వార్డులో మొత్తం 900 ఓట్లు ఉండగా 661 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 73.44 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఓటు వేసిన వారిలో 316 మంది పురుషులు, 345 మంది మహిళలు ఉన్నారు. రీ పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ శ్రీనివాసరావు, ఎన్నికల పరిశీలకుడు హెప్సీబా రాణి పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


