కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

Nov 3 2026 4:45 PM | Updated on Nov 3 2026 4:45 PM

ఒంగోలు టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ నేపధ్యంలో ఒంగోలు రైస్‌ కాలేజీ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ హర్షవర్థన్‌ రాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒంగోలు కార్పొరేషన్‌, అద్దంకి, చీమకుర్తి, మున్సిపాలిటీలకు సంబంధించిన ఒంగోలులోని రైస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో కౌంటింగ్‌కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 34 మంది ఎస్సైలు, 80 మంది ఎఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లుతో పాటుగా 323 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు వివరించారు. ఎన్నికల బందోబస్తులో భాగంగా స్ట్రెకింగ్‌ ఫోర్స్‌, రిజర్వ్‌ ఫోర్స్‌, రైస్‌ కాలేజీ ప్రాంగాణంలో ఫుట్‌ పెట్రోలింగ్‌, రూఫ్‌ టాప్‌, మొబైల్‌ స్క్రీనింగ్‌ పార్టీలు, ప్రత్యేక సిబ్బదిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లే అధికారులు, అభ్యర్థులు, ఏజంట్లు తప్పనిసరిగా కలెక్టర్‌ జారీ చేసిన గుర్తింపు కార్డులను ధరించాలని, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తరువాతే లోపలకు అనుమతిస్తామన్నారు. బయటి వ్యక్తులను అనుమతించమన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరి కదలికలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల లోపలకు సెల్‌ ఫోన్లు, ఇతరా ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతివ లేదని స్పష్టం చేశారు.

రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు....

ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో సోషల్‌ మీడియాలో పుకార్లు, మార్ఫింగ్‌ వీడియోలు, రెచ్చగెట్టే పోస్టులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా సంయమనం పాటించాలని కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కోడ్‌ అమలులో వున్నందు వలన అనుమతి తీసుకోకుండా విజయోత్సవాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్‌ సందర్భంగా కానీ, అనంతరం కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, నేరాలకు పాల్పడినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఐదుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 34 మంది ఎస్సైలతో బందోబస్తు

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

ఎస్పీ హర్షవర్థన్‌ రాజు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement