ప్రచారంలో వైఎస్సార్‌ సీపీ దూకుడు | - | Sakshi
Sakshi News home page

ప్రచారంలో వైఎస్సార్‌ సీపీ దూకుడు

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

ఒంగోలు సబర్బన్‌: ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులు దూకుడు పెంచారు. తమదైనశైలిలో ప్రజలను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజలతో మమేకమై ఇసీ్త్ర బండి నిర్వాహకుడి నుంచి కూరగాయల వర్తకుల వరకు అందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ వారి పనుల్లో చేదోడుగా నిలుస్తూ నేను మీ వాడిని అనిపించుకుంటున్నారు. దీంతో ఓటర్ల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది. ఒంగోలు 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి పొట్లూరు వెంకాయమ్మతో కలిసి మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కోదండరామస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం పోలేరమ్మ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు.

రెండున్నరేళ్లుగా కూటమి పాలకులు

ఏం చేశారు..?

ఎన్నికల ప్రచారంలో కుప్పం ప్రసాద్‌ మాట్లాడుతూ కార్పొరేషన్‌ అని చెప్పడానికి సిగ్గుపడేలా 20వ డివిజన్‌ ఉందన్నారు. కనీసం గ్రావెల్‌ రోడ్లు కూడా లేని దుస్థితి నెలకొందని, కూటమి పాలకులు రెండున్నరేళ్లుగా ఏం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కాలువల్లో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయిందన్నారు. పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని, దోమల బెడదతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్‌ నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి ఎందుకు ఖర్చుచేయడం లేదో చెప్పాలని నిలదీశారు. 41వ డివిజన్‌లోని సుబ్బయ్యకాలనీ, జెడ్పీ కాలనీ, మిలటరీ కాలనీల్లోనూ కుప్పం ప్రసాద్‌ ఎన్నికల ప్రచారం చేశారు. వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఒంగోలులో మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

41వ డివిజన్‌లో పాల్గొన్న

చుండూరి రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement