జిల్లా జైలును సందర్శించిన జడ్జి | - | Sakshi
Sakshi News home page

జిల్లా జైలును సందర్శించిన జడ్జి

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

జిల్లా జైలును సందర్శించిన జడ్జి

ఒంగోలువన్‌టౌన్‌: నగరంలోని జిల్లా జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌ రామకృష్ణ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జైలులోని ఖైదీలకు కల్పిస్తున్న వసతి, భోజన సదుపాయాలను జడ్జి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైదీలతో ముఖాముఖిగా మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యత, ఇతర సౌకర్యాల విషయంలో ఖైదీలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సహాయ సేవల గురించి వివరించారు. న్యాయ సాయం అవసరమైన ఖైదీలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని, అర్హులైన వారికి నిబంధనల ప్రకారం ఉచిత న్యాయ సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రతి ఖైదీకి న్యాయపరమైన హక్కులపై అవగాహన కల్పించడం, అవసరమైన న్యాయ సహాయం అందించడం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జైలు సూపరింటెండెంట్‌ రాజకుమార్‌, జైలర్‌ అప్పలనాయుడు, డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ పి వీర రాఘవులు, న్యాయవాదులు, న్యాయ సేవా సహాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement