ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన నేత | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన నేత

Sep 28 2026 7:39 AM | Updated on Sep 28 2026 7:39 AM

రెవెన్యూ ఉద్యోగుల ఆశాజ్యోతి తోట సుధాకర ప్రసాద్‌ నివాళులర్పించిన జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ నాయకులు

ఒంగోలు సబర్బన్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేసిన నేత రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు తోట సుధాకర్‌ ప్రసాద్‌ అని జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ నాయకులు కొనియాడారు. ఒంగోలు ఆర్‌డీఓ ఆఫీస్‌ పక్కనున్న జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ కార్యాలయ ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. తోట సుధాకర ప్రసాద్‌ 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా సెక్రటరీ రామచంద్రని వాసుదేవరావు మాట్లాడుతూ ఉద్యోగుల కోసం ఎంతో కృషి చేసి ఎన్నో సమస్యల మీద అనేక పోరాటాలు చేసి ఆ పోరాటంలో సుధాకర్‌ ప్రసాద్‌ అసువులు బాశారన్నారు. చనిపోయే ముందు రోజు ఒంగోలులోనే ఇదే స్థలంలో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారన్నారు. జిల్లా కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ తోట సుధాకర్‌ ప్రసాద్‌ ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగానే కాకుండా ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేసి ఎన్నో ఉద్యమ పోరాటాలు చేశారన్నారు. అనంతరం విశ్రాంత ఉద్యోగులు కేఎల్‌ నరసింహారావు, శెట్టి గోపి, బత్తుల పేరయ్య, కోటేశ్వరరావు, శాస్త్రి, తోటకూర ప్రభాకర్‌, రవి, ఆంజనేయులు, నీలకంఠేశ్వరరావు, శివకుమార్‌లను శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ అధ్యక్షులు బి.సత్యసాయి శ్రీనివాస్‌, ఎన్‌ వి బి. రాజేష్‌, ఒంగోలు డివిజన్‌ అధ్యక్షులు ఆంజనేయులు, రాము, రాజు, ప్రశాంత్‌ నాయుడు, రాజేష్‌, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ అధ్యక్షులు కే.వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్‌ రెడ్డి, కందుకూరు డివిజన్‌ అధ్యక్షులు విజయభాస్కర్‌, నారాయణ రెడ్డి, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ సంఘ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement