కాకుమాను రాజశేఖర్‌ మృతి తీరని లోటు | - | Sakshi
Sakshi News home page

కాకుమాను రాజశేఖర్‌ మృతి తీరని లోటు

Sep 25 2026 2:41 AM | Updated on Sep 25 2026 2:41 AM

● వైఎస్సార్‌ సీపీ నేతల సంతాపం

ఒంగోలు సిటీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ ఆకస్మిక మృతిపట్ల పార్టీ ముఖ్య నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు తదితరులు రాజశేఖర్‌ మృతికి సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్‌, మాజీ కౌన్సిలర్లు, క్లౌపేట యూత్‌ ప్రతినిధులు, వైద్యులు, ఇతర రాజకీయ నాయకులు రాజశేఖర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. స్థానిక క్లౌపేట యూత్‌ కార్యక్రమాల్లో రాజశేఖర్‌ చురుగ్గా పాల్గొనేవారని స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఆయన ఆకస్మిక మరణం రాజకీయ, వివిధ సామాజిక వర్గాల్లో విషాదాన్ని నింపింది. ఒంగోలులో కాకుమాని కుటుంబ సభ్యులను వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి గురువారం రాత్రి పరామర్శించారు.

నేడు అంత్యక్రియలు:

కాకుమాని రాజశేఖర్‌ అంత్యక్రియలు శుక్రవారం ఒంగోలులో నిర్వహించనున్నారు. ఒంగోలు క్లౌపేట 3వ లైనులో ఉన్న ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర మొదలవుతుంది. శుక్రవారం ఉదయం వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణా రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మతో పాటు పలువురు రాష్ట్రస్థాయి నాయకులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు రాజశేఖర్‌ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement