లా అండ్‌ ఆర్డర్‌పై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

లా అండ్‌ ఆర్డర్‌పై ప్రత్యేక దృష్టి

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

లా అండ్‌ ఆర్డర్‌పై ప్రత్యేక దృష్టి

● మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా

మార్కాపురం: జిల్లాలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టిసారిస్తామని, జిల్లా మొదటి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పంకజ్‌కుమార్‌ మీనా తెలిపారు. మార్కాపురంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలు, మహిళా భద్రతకు, ఆస్తుల రక్షణపై దృష్టి సారిస్తామన్నారు. జిల్లాలో నేషనల్‌ హైవే, ఘాట్‌ రోడ్డు ఎక్కువగా ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వీటి నివారణకు కూడా కృషి చేస్తామన్నారు. మార్కాపురం జిల్లాలో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, రెవెన్యూ అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. చట్టాన్ని అనుసరిస్తామని, దాన్ని ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి సమాచారమైనా తనకు చెప్పవచ్చని పేర్కొన్నారు.

పోలీసు అధికారులతో సమీక్ష

పోలవరం జిల్లా ఓఎస్‌డీగా పనిచేస్తూ ఎస్పీగా నియమితులైన పంకజ్‌కుమార్‌ మీనా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఓఎస్‌డీ నవజ్యోత్‌ మిశ్రా, డీఎస్పీలు నాగరాజు, సీఐ అల్తాఫ్‌ హుస్సేన్‌, మల్లికార్జున, రాజేష్‌కుమార్‌తో పాటు పలువురు ఎస్సైలు, సీఐలతో సమావేశమయ్యారు. స్టేషన్‌ల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ విజయసునీతను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement