ఖైదీలకు అందుతున్న సేవలపై జిల్లా జడ్జి ఆరా | - | Sakshi
Sakshi News home page

ఖైదీలకు అందుతున్న సేవలపై జిల్లా జడ్జి ఆరా

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

ఖైదీలకు అందుతున్న సేవలపై జిల్లా జడ్జి ఆరా

ఒంగోలువన్‌టౌన్‌: జిల్లా జైలులో ఖైదీలకు అందుతున్న వసతి సదుపాయాలు, ఉచిత న్యాయ సహాయంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ సత్యానంద్‌ ఆరా తీశారు. గురువారం ఆయన జిల్లా జైలును సందర్శించిన సందర్భంగా జైలులో ఖైదీలకు అందుతున్న వసతి, భోజనం, వైద్య సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో ముఖాముఖిగా మాట్లాడిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కేసుల ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఉచిత న్యాయ సాయం పొందుతున్నారా, న్యాయవాదులు అందుబాటులో ఉన్నారా, కేసులకు సంబంధించి ఏమైనా న్యాయ సాయం అవసరమా అనే విషయాలను ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగిన ఖైదీలకు ఉచిత న్యాయ సాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా జడ్జి భరోసా ఇచ్చారు. ఖైదీలకు వారి చట్టపర హక్కులు, ఉచిత న్యాయ సాయం పొందే విధానం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌వీ రామకృష్ణ, జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తులు శాలినీరెడ్డి, రోషన్‌, డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ పీవీ రాఘవులు, న్యాయవాదులు, న్యాయ సేవా సహాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement