రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా క్రికెట్‌ జట్టుకు ఒంగోలు కుర్రోడు | - | Sakshi
Sakshi News home page

రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా క్రికెట్‌ జట్టుకు ఒంగోలు కుర్రోడు

Sep 25 2026 2:41 AM | Updated on Sep 25 2026 2:41 AM

ఒంగోలు సిటీ:

జిల్లా గర్వపడేలా క్రికెట్లో రాణిస్తున్న గొల్లపూడి సుజిత్‌ ను రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా అండర్‌ 23 విభాగానికి భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ఎంపిక చేసింది. ఏపీ నుంచి గొల్లపూడి సుజిత్‌ ఒక్కడే ఎంపిక కావటం అభినందనీయమని ప్రకాశం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ కారుసాల నాగేశ్వరరావు, అధ్యక్షుడు నవీన్‌, జాయింట్‌ సెక్రటరీ బొచ్చు శ్రీనివాసరావు, ట్రెజరర్‌ హనుమంతరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జవహర్‌ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరూ రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాకు సెలెక్ట్‌ కాలేదన్నారు. సుజిత్‌ తండ్రి గొల్లపూడి శ్రీనివాసరావు క్రికెట్‌ అసోసియేషన్‌లో సభ్యుడిగా పనిచేశారు. 2019 తండ్రి అకాల మరణం చెందినా సుజిత్‌ కుంగిపోకుండా తండ్రి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాడు. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు కడప జిల్లాలోని క్రికెట్‌ అకాడమీలో చదువుకుంటూ క్రికెట్‌ శిక్షణ తీసుకున్నాడు. క్రికెట్లో, బ్యాటింగ్‌ బౌలింగ్‌ రెండు విభాగాల్లో నిలకడగా రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది అండర్‌ 23 విభాగంలో వెస్ట్‌ గోదావరిపై ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. 2022లో అండర్‌ 19, రాష్ట్ర స్థాయి, 2024–25 అండర్‌ 23, వన్డే జట్టుకు మల్టీ డేస్‌ జట్టుకు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. 2025–26 సంవత్సరంలో అండర్‌ 23 రాష్ట్రస్థాయి జట్టుకి ఎంపికయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement