హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌ సుదూర ప్రాంతాలకు ఎస్‌ఏ 1 అబ్జర్వర్ల నియామకం..!

ఒంగోలువన్‌టౌన్‌: కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె మన్మథరావు సోమవారం ఒంగోలుకు వచ్చారు. ఒంగోలులోని ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో బస చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజాబాబు అతిథి గృహానికి చేరుకుని హైకోర్టు న్యాయమూర్తిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

ఒంగోలు సిటీ: పదో తరగతి సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌–1 (ఎస్‌ఏ–1) పరీక్షల పాఠశాల స్థాయి పరిశీలకుల (ఎస్‌ఎల్‌ఓ) నియామకంలో నిబంధనలు ఉల్లంఘించారని పీఆర్టీయూ ఏపీ ప్రకాశం జిల్లా శాఖ ఆరోపించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ (డీఎస్‌ఈ) ఉత్తర్వులను పక్కనపెట్టి ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు కేటాయించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నరహరి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్‌ఈ ప్రొసీడింగ్స్‌ ప్రకారం పక్క మండలంలోని సమీప పాఠశాలల ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని పరీక్ష కేంద్రాలకు విధులు కేటాయించారని పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి రావడం, పరీక్ష ముగిసిన అనంతరం తిరిగి సొంత పాఠశాలలకు వెళ్లి విధులు నిర్వహించడం ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. డీఈఓ తక్షణమే స్పందించి డ్యూటీ జాబితాను సవరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement