ఇళ్లు ఖాళీ చేసి బయటికి వెళ్లినా ఇంత వరకు ప్యాకేజి వేయలేదు. నా కుమారులు జడి పెద్దసుబ్బయ్య, చిన్నసుబ్బయ్యలకు ప్యాకేజి పడింది. నాకు, నా చిన్న కుమారుడు రమేష్, కుమార్తెకు ప్యాకేజి పడలేదు. అధికారులకు ఎన్ని సార్లు కాగితాల రూపంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అధికారుల చుట్టూ తిరిగి కాళ్లు అరిగినవే తప్ప ప్యాకేజి వేయలేదు. ఇంటిని అద్దెకు మాట్లాడుకొని సామానులు తీసుకుపోదామనే లోపు నీటిని వదిలారు. ఇంటిలో దాదాపు రూ.2 లక్షల విలువైన సమానులున్నాయి. అవి నీటిలో మునిగిపోతాయని ఆందోళనగా ఉంది.
– జడి ఎలియా, సుంకేసుల గ్రామం


