ఇళ్లు ఖాళీ చేసిన ప్రభుత్వం నేటికీ ప్యాకేజి, ఇంటి పట్టాలు ఇవ్వలేదు. పునరావాస కేంద్రాల్లో ఇంటి పట్టాలు ఇస్తే సమానులు పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. నా పేరుపై డబ్బులు వేయాల్సి ఉండగా వేరే వారి అకౌంట్‌లో జమ చేశారు. నా అకౌంట్ నంబరు వేయాల్సి ఉండగా ఒక నంబరు తేడాతో వేరే వారి ఖాతాలో డబ్బులు జమ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్యాకేజి పడలేదు. అధికారులను సంప్రదించగా త్వరలో డబ్బులు పడతాయని చెబుతున్నారు.
– భూతలపాటి యోబు,
సుంకేసుల గ్రామం


