మేదరమెట్ల: కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామ పరిధిలోని శర్వానీ బయో ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని ఈటీపీ (ఎథిలియోటెడరీ ట్రీట్‌మెంట్ ప్లాంటు) కూలిన ఘటనలో ఒకరు మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో జూనియర్ ఇంజినీర్ అరవింద్ (27) మృతిచెందగా, గాయపడిన వారిలో ఒడిశాకు చెందిన కార్మికులు రవీందర్, భగవాన్, రోహిత్ కుమార్, ముఖేష్ కుమార్, తిరుపతికి చెందిన దక్షిణామూర్తి ఉన్నారు. క్షతగాత్రులు అద్దంకిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అరవింద్ మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రూరల్ సీఐ మల్లిఖార్జునరావు, ఇన్‌చార్జి ఎస్సై సురేష్ శిథిలాల తొలగింపును పర్యవేక్షిస్తున్నారు.


