మువ్వన్నెల రెపరెపలు | - | Sakshi
Sakshi News home page

మువ్వన్నెల రెపరెపలు

Aug 17 2026 7:17 AM | Updated on Aug 17 2026 7:17 AM

అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులకు దరఖాస్తులు శింగరకొండ దర్శిని

అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులకు దరఖాస్తులు

సంతనూతలపాడు: స్వాతంత్య్రదిన వేడుకలను సంతనూతలపాడు నియోజకవర్గంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సంతనూతలపాడు మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. సంతనూతలపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఎస్‌.ఎల్‌.నారాయణరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. సంతనూతలపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి నారాయణరెడ్డి జెండా ఎగురవేశారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ఆర్‌.శ్రీనివాసులు, రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సంతనూతలపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ బుడంగుంట విజయ జాతీయ జెండా ఆవిష్కరించారు.ఎంపీడీవో డి.సురేష్‌బాబు, జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో వాసంతి, మండల పరిషత్‌ ఉద్యోగులు, హైస్కూల్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంతనూతలపాడులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద వాసవీ క్లబ్‌ అధ్యక్షుడు వేమూరి ఆంజనేయులు, వాసవీ మహిళా క్లబ్‌ అధ్యక్షురాలు వేమూరి నాగమణి జాతీయ జెండా ఆవిష్కరించారు. పేర్నమిట్టలోని బి.వి.సుబ్బయ్య హైస్కూల్‌లో హెచ్‌ఎం వై.వేణుగోపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ వై.వెంకటేశ్వరరెడ్డి జెండాలు ఎగురవేశారు. సంతనూతలపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. మద్దిపాడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మన్నం రాజేశ్వరి ప్రసాద్‌ జెండా ఎగురవేశారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌పీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ తోట శ్రీనివాసరావు, సంతనూతలపాడు వెటర్నరీ హాస్పిటల్‌లో వైద్యురాలు అనూరాధ, ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మానస, వేములపాడు పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జగదీష్‌రెడ్డి, సంతనూతలపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐ హనుమంతరావు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓలు వెంకారెడ్డి, షణ్ముఖకుమార్‌, సంతనూతలపాడు హైస్కూల్లో హెచ్‌ఎం ఎం.ప్రమోద జాతీయ జెండా ఎగురవేశారు. పేర్నమిట్టలోని శ్రీ ప్రతిభ జూనియర్‌ కళాశాలలో కళాశాల చైర్మన్‌ నల్లూరి వెంకటేశ్వర్లు, వైస్‌ చైర్మన్‌ నల్లూరి సీతారామాంజనేయులు, సీఈవో నల్లూరి జయప్రకాష్‌ నారాయణ జాతీయ జెండా ఆవిష్కరించారు.

చీమకుర్తి మండలంలో...

చీమకుర్తి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చీమకుర్తిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వేడుకలు జరిగాయి. చీమకుర్తిలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో లయన్స్‌ క్లబ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ బీ జవహర్‌, గ్రానైట్‌ యజమాని చలువాది బదరీనారాయణ చేతుల మీదుగా గతేడాది పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు దాతల సహకారంతో నగదు బహుమతులు అందించారు. మూడు రోజులుగా పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందించారు. చీమకుర్తి మున్సిపల్‌ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బధిరుల పాఠశాల, ప్రభుత్వ హైస్కూలు, వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో బధిరుల పాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మెప్మా కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆలూరి చిరంజీవికి ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ చేతుల మీదుగా ప్రశంసపత్రాన్ని అందించారు.

చీమకుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో...

చీమకుర్తి రూరల్‌: చీమకుర్తి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీడీవో రాఘవేంద్ర, ఏవో శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. చీమకుర్తి పట్టణానికి చెందిన శ్రీ అభయ కళారాధన సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థ, శ్రీ అభయ సేవా ఫౌండేషన్‌ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ మద్దాలి మాధవరావును మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అద్దెనపూడి శ్రీనివాసరావు, ఎంపీడీవో రాఘవేంద్ర, పమిడి వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించి ప్రశంస పత్రం అందజేశారు. పరదీప్‌ ఫాస్ఫేట్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో చీమకుర్తి మండలం పి.నాయుడుపాలెంలో జై జవాన్‌.. జై కిసాన్‌ సదస్సు నిర్వహించి సుమారు 90 మంది రైతులకు అవగాహన కల్పించారు. మాజీ సైనికులను సన్మానించి, పాఠశాల, రైతు భరోసా కేంద్రం ప్రాంగణాల్లో మొక్కలు నాటారు.

మద్దిపాడు మండలంలో...

మద్దిపాడు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఇన్‌చార్జి ఎంపీడీఓ వై.కిషోర్‌కుమార్‌, ఎంపీటీసీ వాకా కోటిరెడ్డి, పైనం ప్రభాకర్‌, మాజీ సర్పంచ్‌లు పల్లపాటి అన్వేష్‌, బొమ్మల రామాంజనేయులు, మద్దినేని శ్రీకాంత్‌, గుడ్డపాతల రవి, జగన్నాథం పూర్ణ, మండల కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గుండ్లాపల్లిలో పదో తరగతిలో 500 మార్కులకుపైగా సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు.

నాగులుప్పలపాడు మండలంలో...

నాగులుప్పలపాడు (మద్దిపాడు): నాగులుప్పలపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి జెండా వందనం చేశారు. ఎంపీటీసీ సభ్యులు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పోతవరంలో...

నాగులుప్పలపాడు మండల పరిఽధిలోని పోతవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2025–26 సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన షేక్‌ లతీఫాకు ఎంపీపీ దంపతులు నలమలపు అంజమ్మ, కోటిరెడ్డి ప్రోత్సాహకంగా శనివారం నగదు బహుమతి అందించారు.

అద్దంకి: పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం శ్రావణ మాసం చవితి తిథి ఉత్తర నక్షత్రం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆలయ ఈవో తిమ్మనాయుడు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం బిందె తీర్థం, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30 గంటల వరకు పంచ హారతుల పూజ చేస్తారు. నిత్య కార్యక్రమాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 7.45 గంటల వరకు జరిగే ప్రదోషకాలార్చన అనంతరం ఆలయం మూసివేస్తారు.

సంతనూతలపాడు నియోజకవర్గంలో ఘనంగా స్వాతంత్య్రదిన వేడుకలు

నాగులుప్పలపాడు (మద్దిపాడు): నాగులుప్పలపాడు మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. మండలంలో మొత్తం 8 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఎంపీపీఎస్‌, మద్దిరాలపాడులో ఎస్‌జీటీ తెలుగు–1, జెడ్పీహెచ్‌ఎస్‌, హెచ్‌.నిడమానూరులో ఎస్‌ఏ బయాలజీ సైన్స్‌–1, జెడ్పీహెచ్‌ఎస్‌, మాచవరంలో ఎస్‌ఏ ఫిజికల్‌ సైన్స్‌–1, జెడ్పీహెచ్‌ఎస్‌, ఉప్పుగుండూరులో ఎస్‌ఏ ఫిజికల్‌ సైన్స్‌–1, జెడ్పీహెచ్‌ఎస్‌, ఈదుమూడిలో ఎస్‌ఏ బయాలజీ సైన్స్‌–1, జెడ్పీహెచ్‌ఎస్‌, వినోదరాయునిపాలెంలో ఎస్‌ఏ సోషల్‌ స్టడీస్‌–1, జెడ్పీహెచ్‌ఎస్‌, కనపర్తిలో ఎస్‌ఏ ఫిజికల్‌ సైన్స్‌–1 చొప్పున ఖాళీగా ఉన్నట్లు వివరించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోగా నాగులుప్పలపాడు మండల విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్‌జీటీ పోస్టులకు నెలకు రూ.10 వేలు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నెలకు రూ.12,500 గౌరవ వేతనం ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్‌ 1 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ 8 నెలల కాలానికి మాత్రమే గౌరవ వేతనం అందిస్తారని వెల్లడించారు.

బైక్‌ జారి లారీకింద పడిన యువకుడు

ఒంగోలు టౌన్‌: బైకు జారి దానిపై ప్రయాణిస్తున్న యువకుడు లారీకింద పడటంతో అతని మీద నుంచి లారీ వెళ్లింది. దీంతో ఆ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇద్దరు అన్నాదమ్ములు బైకు మీద టంగుటూరు వైపు వెళ్తున్నారు. ఒంగోలు దక్షిణ బైపాస్‌ రోడ్డులో చెరువుకొమ్ముపాలెం బస్‌షల్టర్‌ వద్దకు రాగానే సర్వీస్‌ రోడ్డు దాటుతున్న క్రమంలో బైకు అదుపుతప్పి కిందపడింది. తమ్ముడు రోడ్డుకు రెండోవైపు పడగా, అన్న రోడ్డు మీద పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రోడ్డు మీద పడిన యువకుడి మీద నుంచి లారీ వెళ్లడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన యువకుల వివరాలు, ఇతర సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement