ఒంగోలు వన్‌టౌన్: భారతదేశ స్వాతంత్య్ర సముపార్జనలో మహనీయులు చేసిన త్యాగాలను మనందరం స్మరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షిస్తూ న్యాయ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం కలిగే విధంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చావలి రమేష్‌బాబు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్


