సంతనూతలపాడు: పేర్నమిట్టలో డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ సూరం సుధాకర్‌రెడ్డి దశదినకర్మకు శనివారం వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, గ్రామ అధ్యక్షుడు దుంపా యలమందారెడ్డి హాజరై సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సుధాకర్‌రెడ్డి సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు బలిజేపల్లి రామచంద్రారెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి తేళ్ల డేవిడ్‌రాజు, నూకతోటి రాజేష్, సాయి, మచ్చా మురళి, ఈమని కృష్ణారెడ్డి, దాసరి రామారావు, బుట్టి వెంకట్రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


