త్రివర్ణ శోభితం | - | Sakshi
Sakshi News home page

త్రివర్ణ శోభితం

Aug 17 2026 7:17 AM | Updated on Aug 17 2026 7:17 AM

త్రివర్ణ శోభితం

ఒంగోలు సబర్బన్‌: స్వాతంత్య్రదిన వేడుకలు పండుగ వాతావరణంలో శనివారం అట్టహాసంగా జరిగాయి. ఒంగోలు నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో స్పెషల్‌ ఆఫీసర్‌, కలెక్టర్‌ పి.రాజాబాబు జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. సిబ్బంది, పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే జనార్దన్‌, కమిషనర్‌ వెంకట కృష్ణయ్య, ఎంహెచ్‌ఓ వైష్ణవి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఎన్‌జీఓ హోంలో...

ఒంగోలులోని ఎన్‌జీఓ హోంలో అసోసియేషన్‌ నగర అధ్యక్షుడు కొత్తపల్లి మంజేష్‌, షేక్‌ మగ్దుం షరీఫ్‌ స్వాతంత్య్రదిన వేడుకలు నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శరత్‌ బాబు, ఆర్‌సీహెచ్‌ కృష్ణారెడ్డి పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించగా, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

మామిడిపాలెం ఎస్‌ఎస్‌ ట్యాంకు వద్ద...

ఒంగోలులోని మామిడిపాలెం సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌–1 వద్ద వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్రదిన వేడుకలు నిర్వహించారు. అసోసియేషన్‌ నాయకులు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ ఈదర చిన్నారి, అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌లో...

ఒంగోలు నగరంలోని ప్రధాన వ్యాపార కూడలి అయిన బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌లో జాతీయ జెండాను కమిటీ అధ్యక్షుడు చెంచయ్య గుప్తా ఆవిష్కరించారు. కమిటీ కార్యదర్శి కొప్పరావూరి సురేష్‌, కమిటీ సభ్యులతో పాటు ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఎస్‌.ఎస్‌.ఎన్‌ డిగ్రీ కళాశాలలో...

ఒంగోలు సిటీ: ఒంగోలులోని ఎస్‌.ఎస్‌.ఎన్‌ డిగ్రీ కళాశాలలో డైరెక్టర్‌ వై.సత్యనారాయణరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రోగ్రాం అధికారులు శ్యామల, సౌజన్య, నిరుష, వైస్‌ ప్రిన్సిపాల్‌ టి.రాజశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌, అధ్యాపకులు అంజయ్య, రాయుడు, పి.ఖాజపీర్‌, పి.గఫూర్‌, పి.రాజశేఖర్‌, వీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఏకేయూ, ఇతర కళాశాలల్లో...

ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీలో వీసీ డి.వి.ఆర్‌.మూర్తి జాతీయ జెండా ఎగురవేశారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.హరిబాబు, ప్రిన్సిపాల్‌ నిర్మలామణి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సీఎస్‌ఆర్‌ శర్మ కళాశాలలో ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, మేనేజింగ్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టరు గంజాం శ్రీనివాసమూర్తి, సెక్రటరీ కరస్పాండెంట్‌ కరవది రాఘవరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ట్రెజరర్‌ ఓరుగంటి నరసింహశాస్త్రి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏకెవీకే జూనియర్‌, డిగ్రీ కళాశాలలో కరస్పాండెంట్‌ చెంచురామయ్య జాతీయ జెండా ఆవిష్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అధ్యక్షుడు మండవ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ కె.రామిరెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టరు పి.శ్రీనాథ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రైజ్‌ కృష్ణసాయి ప్రకాశం గ్రూప్‌ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో సెక్రటరీ, కరస్పాండెంట్‌ శిద్దా హనుమంతరావు, కళాశాల చైర్మన్‌ శిద్దా వెంకటేశ్వరరావు, గౌరవ చైర్మన్‌ ఇస్కాల చినరంగమన్నారు, వైస్‌ చైర్మన్‌ శిద్దా సూర్యప్రకాశరావు, ట్రెజరర్‌ శిద్దా భరత్‌, డైరెక్టరు డాక్టరు ఏ.వి.భాస్కరరావు, ప్రిన్సిపాళ్లు సుబ్రహ్మణ్యం, రమేష్‌ పాల్గొన్నారు. వైస్‌ చైర్మన్‌, ఇంటర్నేషనల్‌ ఆర్యవైశ్య ప్రెసిడెంట్‌ శిద్దా సూర్యప్రకాశరావు జాతీయ జెండా ఆవిష్కరించారు.

సీపీఎం, సీపీఐ కార్యాలయాలలో...

ఒంగోలు టౌన్‌: స్థానిక సుందరయ్య భవనంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు, చీకటి శ్రీనివాసరావు, రమేష్‌, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు. సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటరావు జాతీయ జెండా ఆవిష్కరించగా, శ్రీరాం శ్రీనివాసరావు, ఆర్‌.రామకృష్ణ, కొత్తకోట వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో...

ఒంగోలు వన్‌టౌన్‌: ఒంగోలులో రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెడ్డి హాస్టల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న హాస్టల్‌ అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ బత్తుల బ్రహ్మానందరెడ్డి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. రెడ్డి జనాభ్యుదయ సంఘ నాయకులు, రెడ్డి హాస్టల్‌ కార్యదర్శి చిన్నపరెడ్డి ఆదిరెడ్డి, శ్రీశైలం రెడ్డి సమాఖ్య ఉపాధ్యక్షుడు పాలవల్లి నరసింహారెడ్డి, రెడ్డి సంఘ సభ్యులు పల్లపోలు శేషిరెడ్డి, రామసుబ్బారెడ్డి, వెంకట్రామిరెడ్డి, సుబ్బారెడ్డి, నర్సారెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, మల్లవరపు విజయ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రూడ్‌సెట్‌ సంస్థలో...

ఒంగోలులోని రూడ్‌సెట్‌ సంస్థలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ డైరెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి జాతీయ జెండా ఎగురవేయగా, సంస్థలో గతంలో శిక్షణ పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందిన యువ వ్యాపారస్తులను సన్మానించారు. లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కొత్తపట్నంలో...

కొత్తపట్నం: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఎంపీడీవో శ్రీకృష్ణ పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ డి.రామానాయుడు, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై వేముల సుధాకర్‌బాబు, మైరెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై పి.సుబ్బారావు, మండల వనరుల కేంద్రంలో ఎంఈవో 1, 2 తులసీ, పద్మావతి ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అన్ని పంచాయతీ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు, కొత్తపట్నం, ఈతముక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు శ్రావ్య, నవ్యారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. డిప్యూటీ ఎంపీడీవో వేణుగోపాల్‌కృష్ణమూరి, ఏవో కిషోర్‌ బాబు, పంచాయతీ కార్యదర్శులు, మండల సిబ్బంది పాల్గొన్నారు.

వాడవాడలా రెపరెపలాడిన

మువ్వన్నెల జెండా

పండుగ వాతావరణంలో

స్వాతంత్య్రదిన వేడుకలు

ఒంగోలు నగరపాలక సంస్థలో జాతీయ జెండా ఎగురవేసిన కలెక్టర్‌ రాజాబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement