ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

Aug 17 2026 1:53 AM | Updated on Aug 17 2026 1:53 AM

ఒంగోలు సిటీ: స్థానిక లార్డ్‌ కృష్ణ బ్యాడ్మింటన్‌ అకాడమీలో ఐదు రోజుల నుంచి నిర్వహిస్తున్న యోనెక్స్‌ సన్‌ రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌–2026 అండర్‌–19 బాలబాలికల బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో బాలబాలికలు పోటీలు పడి ఆడారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్స్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన కరామత్‌ హుల్హాక్‌, గుంటూరుకు చెందిన దీపిక విజేతలుగా, లక్ష్మి వైశాక్‌, స్ఫూర్తి రన్నర్స్‌గా నిలిచారని లార్డ్‌ కృష్ణ బ్యాడ్మింటన్‌ అకాడమీ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ అద్దంకి మురళీకృష్ణ తెలిపారు. బాలికల సింగిల్స్‌లో కాకినాడకు చెందిన త్రిషిష్టా దీపతి విజేతగా నిలవగా, కాకినాడకే చెందిన విజయలక్ష్మి రన్నర్‌గా నిలిచారని చెప్పారు. అదేవిధంగా బాలుర సింగిల్స్‌లో విశాఖపట్నంకు చెందిన లక్ష్మి వ్యాషక్‌ విజేతగా నిలవగా, పశ్చిమ గోదావరికి చెందిన లక్ష్మి శ్వేతన్‌ రన్నర్‌గా నిలిచారు. బాలికల డబుల్స్‌లో పశ్చిమ గోదావరికి చెందిన రుత్విక, మనోజ విజేతలుగా నిలవగా, సిరి హాసిని, స్ఫూర్తి రన్నర్స్‌గా నిలిచారు. బాలుర డబుల్స్‌లో విశాఖపట్నంకు చెందిన లక్ష్మి వ్యాషక్‌, కె.రాహుల్‌ విజేతలుగా నిలవగా, అభిషేక్‌, లక్ష్మి శ్వేతన్‌ రన్నర్స్‌గా నిలిచినట్లు మురళీకృష్ణ వెల్లడించారు. విజేతలను ఆంధ్రప్రదేశ్‌ 20 సూత్రాల కార్యక్రమ అమలు చైర్మన్‌ లంకా దినకర్‌, ఒంగోలుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ అభినందించి ట్రోఫీలు, ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, కార్యదర్శి పి.విజయకృష్ణ, టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి రఘుబాబు, అశోక్‌రెడ్డి, దండు శ్రీనివాసరావు, కోడె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement