తాళ్లూరు: యువకుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన తాళ్లూరులో జరిగింది. గ్రామానికి చెందిన అనుపర్తి రత్నకుమార్ అనే యువకుడు గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం రాత్రి ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన రత్నకుమార్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందారు. అందరూ వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రత్నరాజు ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా కుటుంబ సభ్యులకు 9949332873 సెల్ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.


