ఒంగోలు సిటీ: 13వ సబ్‌జూనియర్ ప్రకాశం జిల్లా ఉషు చాంపియన్ షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి ఉషు చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు. వివిధ వెయిట్ కేటగిరీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో జిల్లా ఉషు జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న జిల్లా క్రీడాకారులు ఆగస్టు 16, 17 తేదీల్లో ఒంగోలు టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించనున్న 13వ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ ఉషు చాంపియన్ షిప్–2026 పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నారు. జిల్లా స్థాయి ఉషు పోటీలకు జిల్లా ఉషు చైర్మన్ పి.ప్రకాష్ బాబు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.భాస్కరరావు, మాంటిస్సోరి స్కూల్ డైరెక్టర్ శబరినాథ్, ప్రిన్సిపల్ ఎస్కే నూరుద్దీన్ క్రీడాకారులను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు క్రీడాకారులకు సూచించారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న ప్రతి క్రీడాకారుడికి సంఘ సభ్యులు ఈ వెంకటేష్, చంద్రశేఖర్, వెంకట నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, నిర్వాహకులను అభినందించారు.


