దర్శి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహోద్యమంశ్రీలో భాగంగా శుక్రవారం దర్శి పట్టణంలో 700 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే బూచేపల్లి, జెడ్పీ చైర్‌పర్సన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. చిన్నతనం నుంచే యోగా, ధ్యానం అలవాటు చేసుకుని సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు జీవీ రత్నం, బ్రహ్మకుమారీస్ దర్శి, పొదిలి కేంద్రాల ఇన్‌చార్జ్‌లు బీకే ఉష, లత, నాయకులు వెన్నపూస వెంకటరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, సోము దుర్గారెడ్డి, కేవీ రెడ్డి, మేడం మోహన్‌రెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, బండి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బూచేపల్లి, జెడ్పీ చైర్‌పర్సన్
వెంకాయమ్మ
దర్శిలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ


