దోపిడీ కోసమే దగా డీఎస్సీ | - | Sakshi
Sakshi News home page

దోపిడీ కోసమే దగా డీఎస్సీ

Aug 7 2026 3:53 AM | Updated on Aug 7 2026 3:53 AM

వైఎస్సార్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న

ఎమ్మెల్యే తాటిపర్తి, నాయకులు

యర్రగొండపాలెం:

విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్‌ పూర్తిగా అసమర్థుడని, డీఎస్సీ 2025లో పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడిన ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర చరిత్రలో విద్యాశాఖను ఇంతలా దిగజార్చిన మంత్రి మరొకరు లేరన్నారు. గురువారం వైఎస్సార్‌ సీపీ పిలుపు మేరకు స్థానిక యూనియన్‌ బ్యాంక్‌ సమీపంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జీవో నంబర్‌ 74ను రద్దు చేసి, ఇష్టానుసారంగా 447 జీవోను తెచ్చి అక్రమార్కులకు గేట్లు తెరిచారని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు అమ్ముకున్న తర్వాత ఆ జీవోను నిలిపివేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి కింద ఒక్క రూపాయి ఇవ్వలేదని, 20 లక్షల ఉద్యోగాల హామీ గాలికొదిలేశారని విమర్శించారు. నేమ్‌ చేంజర్‌గా మారిన చంద్రబాబు.. గేమ్‌ చేంజర్‌ అయిన శ్రీఅమ్మ ఒడిశ్రీని సర్వనాశనం చేశారని, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. డీఎస్సీ క్వాలిఫై అయి నష్టపోయిన అభ్యర్థుల పక్షాన పోరాడుతున్నారన్నారు. యువత బాగుంటేనే కుటుంబం క్షేమంగా ఉంటుందని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు నాలుగు రోజుల పాటు రిలే దీక్షలు కొనసాగుతాయని, చివరి రోజు భారీ ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. పేపర్‌ లీక్‌కు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి రాజీనామా చేసిన తరహాలోనే నారా లోకేశ్‌ కూడా తప్పుకోవాలని హితవు పలికారు. అంతకుముందు వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు దోగిపర్తి సంతోష్‌కుమార్‌, పట్టణ అధ్యక్షుడు కందూరి కాశీవిశ్వనాథ్‌, జిల్లా అధికార ప్రతినిధి ఏలూరి వెంకట నారాయణరెడ్డి, త్రిపురాంతకం ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, పుల్లలచెరువు జెడ్పీటీసీ వాగ్యానాయక్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, ఐటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, ఇంటిలెక్చువల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అంగిరేకుల ఆదినారాయణ, ముస్లిం మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ బుజ్జి, సయ్యద్‌ జబీవుల్లా, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్‌, ఆళ్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

రిలే దీక్షలో నిరసన గళం

రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్‌ సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్ధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐ.వి.సుబ్బారావు, కందూరి గురుప్రసాద్‌, పబ్బిశెట్టి శ్రీనివాసులు, వై.రాంబాబు, జి.కృష్ణారావు, వై.వెంకటేశ్వరరెడ్డి, శేషసేనారెడ్డి, ఎం.ఆదిశేషు, ఒంగోలు సుబ్బారెడ్డి, టి.సత్యనారాయణరెడ్డి, జానకి రఘు, కె.నాగార్జునరెడ్డి, షేక్‌.మహమ్మద్‌ కాశిం, షేక్‌.కాశింపీరా, షేక్‌.వలీ, ఆర్‌.బద్దునాయక్‌, ఒంటేరు నాగేశ్వరరెడ్డి, సింగా ప్రసాద్‌, మంద సుబ్బారెడ్డి, పి.వెంకటేశ్వర్లు, పి.మంత్రూనాయక్‌, చెవుల ఆంజయ్య, వీరయ్య, టి.రాంబాబు, అచ్చయ్య, చెన్నయ్య, జాన్‌, ఒ.లక్ష్మిరెడ్డి, కె.వెంకటరెడ్డి, రాజయ్య, జి.చిన్నశ్రీనివాసరెడ్డి, బయ్యన్న, నాసరయ్య, శ్యాం, బి.వెంకటరత్నం, బాలకోటిరెడ్డి, శేషిరెడ్డి, రాజు, శివరామకృష్ణ, రామయ్య, బబుల్‌రెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. మండల పార్టీ ఉపాధ్యక్షుడు దోగిపర్తి సంతోష్‌కుమార్‌ నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement