ఎన్ని కేసులు పెట్టినా భయపడం | - | Sakshi
Sakshi News home page

ఎన్ని కేసులు పెట్టినా భయపడం

Aug 7 2026 3:53 AM | Updated on Aug 7 2026 3:53 AM

కనిగిరి చరిత్రలో ఇలాంటి రాజకీయం ఎప్పుడూ లేదు వైఎస్సార్‌ సీపీ నియోజకరవ్గ ఇన్‌చార్జి దద్దాల ధ్వజం

కనిగిరి రూరల్‌: ప్రతిపక్ష పార్టీలు, ఇతర పార్టీలు ఎవరైనా గత 20 ఏళ్ల నుంచి కనిగిరిలో పీవీఆర్‌ పార్క్‌ వద్దనే నిరసనలు, ధర్నాలు చేసేవారని, ఈ విషయం అందరికీ తెలుసని, కానీ ఈసారి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్‌ సీపీ నియోజకరవ్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణయాదవ్‌ ధ్వజమెత్తారు. పోలీసు అధికారులు కూడా కనీస న్యాయం లేకుండా అధికార పార్టీకి తలొగ్గి పనిచేయడం సరికాదన్నారు. దీన్ని మేము గుర్తుపెట్టుకుంటామని, కనిగిరి చరిత్రలో ఇలాంటీ నీచ రాజకీయాన్ని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో గురువారం కనిగిరిలో నిర్వహించిన దీక్ష అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడారు. డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలు జరిగాయన్నారు. స్పోర్ట్స్‌ కోటాలోని పోస్టుల నియామకాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కొత్త కొత్త జీవోలతో డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం చేశారని వివరించారు. కూటమి ప్రభుత్వం పెద్దల అనుచరులకు పోస్టుల విక్రయాలు జరిగాయని విమర్శించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారా..? జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడా..? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఏమైందని ధ్వజమెత్తారు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, యువత, విద్యార్థుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్‌ సీపీ పోరాటం సాగిస్తుందని, కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని దద్దాల స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ కనిగిరి పట్టణ అధ్యక్షుడు ఎస్‌కే అబ్దుల్‌ గఫార్‌, జెడ్పీటీసీలు మడతల కస్తూరిరెడ్డి, గుంటక తిరుపతిరెడ్డి, గంగసాని హుసేన్‌రెడ్డి, చప్పిడి వెంకట సుబ్బయ్య, ఓకే రెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, కల్లూరి రామిరెడ్డి, యక్కంటి శ్రీనివాసులరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, సిరుప వెంకట గోవర్దన్‌రెడ్డి, కటికల వెంకటరత్నం, మూలే గోపాల్‌రెడ్డి, పులి శాంతి గోవర్దన్‌రెడ్డి, ఎస్‌కే గయాజ్‌, ఆయిమల్ల నాగమణి, వాకుమళ్ల రాజశేఖర్‌రెడ్డి, సంగటి మహేంద్రారెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, డాక్టర్‌ రసూల్‌, డాక్టర్‌ ఆవుల కృష్ణారెడ్డి, ఎస్‌కే రహీం, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, భారతి, సుస్మిత, ఇండ్లా భాను, ప్రత్తి సురేష్‌రెడ్డి, పి.ఆదాం, పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్‌కే పాచ్ఛా, పోలక సిద్దారెడ్డి, తాతపూడి సురేష్‌బాబు, ఎర్రబల్లి దేవరాజ్‌, శ్యామల సాంబశేఖర్‌రెడ్డి, పలుకూరి భాస్కర్‌, డి.రవియాదవ్‌, భాస్కర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాములు, మిట్టా రమేష్‌రెడ్డి, ఎలికా నారాయణ, కాకర్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement