టంగుటూరు: ఓ కేసులో నిందితున్ని తీసుకువెళ్లేందుకు వినియోగించిన పోలీసుల కారును లారీ ఢీకొట్టింది ఈ సంఘటన టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలోని ఐఓసీ ఎదుట గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్సై ఫణి భూషణ్ తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ స్టేషన్‌కు చెందిన పోలీస్ సిబ్బంది నెల్లూరులోని ఓ వ్యక్తిని ఓ కేసుపై పీటీ వారంటీ కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలో వల్లూరు సమీపంలోకి వచ్చేసరికి ఐఓసీఎల్‌లో గ్యాస్ నింపేందుకు వెళుతుండగా ఒరిస్సా నుంచి వెనక వస్తున్న లారీ బలంగా తాకింది. ప్రమాదంలో కారు కుడిభాగం దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదు. టంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.


