మెగా కాదు దగా డీఎస్సీ | - | Sakshi
Sakshi News home page

మెగా కాదు దగా డీఎస్సీ

Aug 4 2026 1:53 AM | Updated on Aug 4 2026 1:53 AM

కనిగిరి రూరల్‌: కూటమి ప్రభుత్వంలో చేపట్టిన 2025 మెగా డీఎస్సీ నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందని, నిరుద్యోగ యువతకు తీవ్ర ద్రోహం చేసిన ఈ స్కామ్‌పై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎస్‌.కె.అబ్దుల్‌ గఫార్‌ అధ్యక్షతన టౌన్‌హాల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కారు నిరుద్యోగులను దారుణంగా వంచించిందని ధ్వజమెత్తారు. అర్హులైన అభ్యర్థులకు కాకుండా ఐటీడీపీ (జీఖీఈ్క) కార్యకర్తలకు, టీడీపీ నాయకులకే ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపు, ఏటా జాబ్‌ క్యాలెండర్‌, 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ఆయన నిలదీశారు. మెగా డీఎస్సీ దగాపై వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని, అర్హులైన ప్రతి అభ్యర్థికీ న్యాయం చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, 10వ తేదీన నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు నేతలు సైతం డీఎస్సీ అక్రమాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు మడతల కస్తూరిరెడ్డి, గుంటక తిరుపతిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ చింతగుంట్ల సాల్మన్‌ రాజు, ఓ.కె.రెడ్డి, ఆవుల భాస్కర్‌రెడ్డి, మూలే గోపాల్‌రెడ్డి, తమ్మనేని సుజాతరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గంగసాని హుస్సేన్‌రెడ్డి, యక్కంటి శ్రీనివాసులరెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, కటికల వెంకటరత్నం, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు రాచపూడి మాణిక్యరావు, గూడూరి అబ్రహం లింకన్‌, భువనగిరి వెంకటయ్య, కాకర్ల వెంకటేశ్వర్లు, మితికాల గురవయ్య, ఏలిక నారాయణ, వేసపోగు గురుప్రసాద్‌, వాకమల్ల రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్‌ ఎస్‌కే నాయబ్‌ రసూల్‌, డాక్టర్‌ ఆవుల కృష్ణారెడ్డి, శ్యామల సాంబశేఖర్‌రెడ్డి, పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, పోలక సిద్ధారెడ్డి, శ్రీరామ శ్రీనివాసులు, గూడూరి అనిల్‌, తాతపూడి సురేష్‌, తాతపూడి నాని, షేక్‌ బారా షరీఫ్‌, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, బచ్చు వెంగళరావు గుప్తా, దరిశి ఫణి, చెన్నుపాటి వెంకటరావు చౌదరి, దాదిరెడ్డి మాలకొండరెడ్డి, పల్నాటి భాస్కర్‌రెడ్డి, ముత్యాల ప్రతాప్‌, ఎస్‌.కె.సన్నీ పాషా, కలికాయి నారాయణ, మద్ది తిరుపతయ్య, మేడం ఆదినారాయణరెడ్డి, డాక్టర్‌ షేక్‌ గౌస్‌ బాషా, గాలి నాగేశ్వరరావు, బాపట్ల కొండలరావు, గుంటక రమణారెడ్డి, సానికొమ్ము మధుసూదన్‌రెడ్డి, మారం వెంకటేశ్వరరెడ్డి, భూమిరెడ్డి రామచంద్రారెడ్డి, పి.ఆదాము, గొంగటి మహేందర్‌రెడ్డి, ఎం.వెలుగొండయ్య, మేకల మాల్యాద్రి, శీలం సుదర్శన్‌, దాసరి మురళి, పలుకూరి భాస్కర్‌, ఎలిక అచ్చయ్య, శెట్టిపల్లి కొండయ్య, ఎస్‌.వెంకటేశ్వరరెడ్డి, కన్నేటి సుబ్బారెడ్డి, కనుమర్ల వెంకటేశ్వరరెడ్డి, వేముల శివ, గజ్జల కోటిరెడ్డి, చిలకల నారాయణరెడ్డి, శ్యామల ప్రసాద్‌రెడ్డి, ముక్కు వేణుగోపాల్‌రెడ్డి, ఎరబ్రెల్లి శౌరి, భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, మూలే దశరథరెడ్డి, కత్తి మరియబాబు, షేక్‌ సన్నీ, బలసాని మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఎస్పీ స్కామ్‌పై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి

నిరుద్యోగులను వంచించి టీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చారు

నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలి

ఈ నెల 6 నుంచి 9 వరకు రిలే దీక్షలు, 10న భారీ నిరసన ర్యాలీలు

వైఎస్సార్‌ సీపీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement