సీఎస్‌పురం(పామూరు): విద్యుదాఘాతానికి జేసీబీ టిప్పర్ ట్రాలీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని ఉప్పలపాడు గ్రామ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జేసీబీ టిప్పర్ ట్రాలీ డ్రైవర్ మాదినేని వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవర్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం జేసీబీని టిప్పర్ ట్రాలీ వాహనంపై ఎక్కించుకుని నిర్మాణంలోఉన్న హైవే మీదకు తీసుకువెళ్తుండగా ఉప్పలపాడు గ్రామ సమీపంలో రోడ్డుపైన ఉన్న విద్యుత్‌వైర్లు గాలికి ప్రమాదవశాత్తు జేసీబీకి తగలగా విద్యుదాఘాతానికి గురై మాదినేని వెంకటసుబ్బయ్య(50) అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై మృతుని సోదరుడు బాలక్రిష్ణ ఇచ్చిన పిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం వెంకటసుబ్బయ్య భౌతికకాయాన్ని కనిగిరి వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య మాధవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అప్పటివరకు తమతో ఉన్న భర్త ఇలా మృత్యువాత పడటంతో భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


