● 10 మందికి గాయాలు
యర్రగొండపాలెం: కూలి పనులకు వెళ్తున్న ఆటో ఆదుపుతప్పి బోల్తా పడి 10 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని నరసాయపాలెంకు చెందిన కూలీలు ఆది వారం ఒక ఆటోలో పనుల నిమిత్తం త్రిపురాంతకం వెళ్తున్న సమయంలో రామసముద్రం ఎస్సీ కాలనీ వద్ద ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించే ప్రయత్నంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో సి.నాగలక్ష్మమ్మ, పి.మునెమ్మ, శివానీ, రాజయ్య, నాగలక్ష్మి, కె.మస్తానమ్మ, పాశం మస్తానమ్మ, బాలయ్య, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆటోలో 15 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగలక్ష్మమ్మ, నాగలక్ష్మి, మస్తానమ్మ


