దొనకొండ: స్థానిక విమానాశ్రయాన్ని గన్నవరం ఎయిర్‌పోర్ట్ అధికారులు శనివారం పరిశీలించారు. బ్రిటీష్ కాలంలో సర్వే నంబర్ 14లో 135.36 ఎకరాల స్థలంలో ఎయిర్‌పోర్టును నిర్మించారు. ఆ విమానాశ్రయ స్థలంలోని భవనం, హెలీప్యాడ్, పరిసరాలను పరిశీలించి ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ రామకృష్ణను ఇక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
తాళ్లూరు: ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వెల్లంపల్లి ప్రధాన రహదారి శివరాంపురం–కొర్రపాటివారిపాలెం రోడ్డుపై శనివారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు శివరాంపురం నుంచి తాళ్లూరు వస్తోంది. అదే రోడ్డు వైపు ద్విచక్ర వాహనదారుడైన కొర్రపాటి ఆంజనేయులు(55) కూడా వెళ్తున్నాడు. రోడ్డుకు అవతలి వైపు పొలాల్లో ఉన్న ఓ రైతు ద్విచక్ర వాహనదారుడిని పిలిచాడు. ఎడమ నుంచి కుడి వైపునకు ద్విచక్ర వాహనదారుడు వెళ్లగా వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం బస్సు డ్రైవర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
11డిఆర్‌ఎస్43: ఆంజనేయులు మృతదేహం


