జిల్లా క్రీస్తు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా క్రీస్తు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Mar 20 2026 10:16 AM | Updated on Mar 20 2026 10:16 AM

జిల్లా క్రీస్తు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక వీడబ్ల్యూఎస్‌ఈఎఫ్‌ కమిటీలో ఒంగోలు సెక్రటరీలకు చోటు

మార్కాపురం టౌన్‌: మార్కాపురం పట్టణంలోని హవేలీ ఫంక్షన్‌ హాల్లో మార్కాపురం జిల్లా క్రీస్తు సంఘ ఐక్యవేదిక చారటబుల్‌ ట్రస్టు సమావేశం గురువారం జరిగింది. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘ సువార్తీకులు 150 మంది హాజరై నూతన కమిటీని ఎన్నుకున్నట్లు అధ్యక్షుడిగా నియమితులైన చాట్ల గంగయ్య తెలిపారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సింగ రాజేష్‌, ఉపాధ్యక్షులుగా గొంగటి ఏలియా, దర్శనం సుధీర్‌ బాబు, గుర్రంబాబు, కార్యదర్శులుగా ముటుకూరి దేవదానం, వేశపోగు భరత్‌, ఎనిబెర అచ్చయ్య, గుర్రం శరత్‌బాబు, కోశాధికారి బూదాల అశోక్‌కుమార్‌, ఈసీ మెంబర్లుగా పల్లె బాబు, దర్శి షాలెం రాజు, ఇంటూరి జయరాజు, పుప్పాల డేవిడ్‌, గౌరవ అధ్యక్షులుగా వంకాయలపాటి జర్మియ, చిలకా ఇజ్రాయేలు, రావినూతల సుధాకర్‌రావు, వేశపోగు బాలు దర్శనం పెద్ద యేసయ్య, గౌరవ సలహాదారులుగా కొంగలేటి సోలోమన్‌ రాజు, నన్నేపోగు సుందర్‌రాజు, వంకాయలపాడి డేవిడ్‌రాజు, గంగవరపు డేవిడ్‌ ఎన్నికై నట్లు పేర్కొన్నారు.

ఒంగోలు సబర్బన్‌: విలేజ్‌ అండ్‌ వార్డ్‌ సెక్రటేరియట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీలో ఒంగోలు నగరంలో వార్డు సెక్రటరీలుగా పనిచేస్తున్న ఇద్దరికి చోటు దక్కింది. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వార్డ్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ పిట్టు రవికుమార్‌ రెడ్డి, వేల్సూరి హరిబాబు గురువారం ఓ ప్రకనటలో పేర్కొన్నారు. తమ నియామకానికి సహకరించిన ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు, సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కమిటీలో స్థానం దక్కించుకున్న ఇద్దరిని ఒంగోలు నగర పాలక సంస్థ వార్డు సెక్రటరీల అసోసియేషన్‌ నాయకులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement