పశు పోషకులను ప్రోత్సహించేందుకే ఎడ్ల పందేలు | - | Sakshi
Sakshi News home page

పశు పోషకులను ప్రోత్సహించేందుకే ఎడ్ల పందేలు

Jan 5 2026 7:35 AM | Updated on Jan 5 2026 7:35 AM

పశు ప

పశు పోషకులను ప్రోత్సహించేందుకే ఎడ్ల పందేలు

ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

యర్రగొండపాలెం: తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయానికి అద్దంపట్టే పండుగ సంక్రాంతి అని, అటువంటి పండుగ సందర్భంగా పశు పోషకులను ప్రోత్సహించటానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికారం ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం ఆయన ఎడ్ల పందేల వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సంక్రాంతి అంటే పంటలు, పశు సంపద మన ప్రధాన సాంప్రదాయమని అన్నారు. ఒంగోలు పశు ప్రోత్సాహక కమిటీ ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తుంటారని, వారి ఆధ్వర్యంలో 20 సంవత్సరాల తరువాత యర్రగొండపాలెం వేదికగా ఎడ్ల పందేలు జరగబోతున్నాయన్నారు. మన సంస్కృతిని భావితరాలకు ఇవ్వడం కోసం ఈ నెల 11, 12, 13, 14 తేదీల్లో నాలుగు విభాగాలుగా ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ పోటీలను తిలకించి ఆశీర్వదించాలని కోరారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పెద్ద ఎత్తున తొలిసారి నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లాలో ఉన్న అన్ని విభాగాలకు చెందిన ఎడ్లను తీసుకొని రావాలని, ప్రతి రైతు గర్వించేలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు సమకూర్చుతున్నామని చెప్పారు. ఎడ్ల పందేలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజన వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ముందుగా ఎడ్ల పందేలు నిర్వహించే స్థానిక పుల్లలచెరువు రోడ్డులోని పార్కుకు సమీపంలో ఉన్న కేఎస్‌ ప్లాట్లలో సిద్ధం అవుతున్న గ్రౌండ్‌ను ఆయన పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర మాజీ కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీలు దొంతా కిరణ్‌గౌడ్‌, గుమ్మా ఎల్లేష్‌ యాదవ్‌ పద్మజ, పార్టీ మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, ఆనికాల వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్‌, వివిధ విభాగాల నాయకులు కందూరి కాశీవిశ్వనాథ్‌, పెద్దకాపు వెంకటరెడ్డి, షేక్‌.షెక్షావలి, మిడత నరసింహరావు, మేడగం వెంకటరెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, ఎల్‌.రాములు, ఆర్‌.అరుణాబాయి, గార్లపాటి శారద, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సంతోష్‌ కుమార్‌, షేక్‌.కాశింపీరా, మహ్మద్‌ కాశిం, తమ్మినేని సత్యనారాయణరెడ్డి, ఆవుల కోటిరెడ్డి, ఆవుల రమణారెడ్డి, తోకల ఆవులయ్య యాదవ్‌, పి.రామయ్య, సురేష్‌ నాయక్‌, అట్టా వెంకటరెడ్డి, హరినాయక్‌ పాల్గొన్నారు.

పశు పోషకులను ప్రోత్సహించేందుకే ఎడ్ల పందేలు1
1/1

పశు పోషకులను ప్రోత్సహించేందుకే ఎడ్ల పందేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement