వాహనం ఢీకొని దుప్పి మృతి
వలేటివారిపాలెం: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దుప్పి మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు వలేటివారిపాలెం మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామం వద్ద 167 బీ హైవే రోడ్డును ఆడ పొడ దుప్పి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డు పక్కన పడిపోయింది. దీన్ని గమనించిన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారి హనుమంతురావు సంఘటన స్థలానికి చేరుకొని చనిపోయిన దుప్పిని స్థానిక పశు వైద్యశాలకు తరలించారు. సహాయ సంచాలకుడు డాక్టర్ చెన్నకేశవులు సూచనల మేరకు పోకూరు డాక్టర్ సుధాకర్ దుప్పికి శవ పరీక్షలు నిర్వహించి ఫారెస్ట్ అధికారులకు అందజేశారు. ఫారెస్ట్ అధికారి హనుమంతురావు అడవిలో దుప్పిని దహనం చేశారు.
చీమకుర్తి రూరల్: సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోని బండ్లమూడి గ్రామంలో బండ్లమూడి యువజన సంఘం ఆధ్వర్యంలో 7వ జిల్లా స్థాయి టెన్నిస్‌బాల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం ప్రారంభించారు. స్థానిక ఎస్సై వెంకట కృష్ణయ్య పాల్గొని క్రీడాకారులకు సూచనలు ఇచ్చారు. ఈ టోర్నమెంట్ 15వ తేదీ వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
వాహనం ఢీకొని దుప్పి మృతి


