వైఎస్సార్ సీపీ జోష్..
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను గురువారం అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి, చీమకుర్తిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేశారు. యర్రగొండపాలెంలో స్థానిక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్సార్ సీపీ శ్రేణుల నడుమ కేక్ కట్ చేశారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరాయకొండలోని పార్టీ కార్యాలయంలో కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కాపురంలో పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు 680 కిలోల భారీ కేక్ కట్‌చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. కనిగిరిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణయాదవ్, గిద్దలూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి వారిని సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఒంగోలులోని
వైఎస్సార్ సీపీ
జిల్లా కార్యాలయంలో
కేక్ కట్ చేస్తున్న
బత్తుల బ్రహ్మానందరెడ్డి, చుండూరి రవిబాబు, నాయకులు,
కార్యకర్తలు
అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు
– సాక్షి, ఒంగోలు
వైఎస్సార్ సీపీ జోష్..
వైఎస్సార్ సీపీ జోష్..


