గ్రానైట్ ఓవర్‌లోడుతో రవాణా చేయరాదు
ఒంగోలు రవాణా శాఖ డీటీసీ ఆర్.సుశీల లారీల ఓనర్లు, క్రషర్ యజమానులతో ప్రత్యేకంగా సమావేశం
ఎరిక్షన్‌బాబును వైపాలెం ఇన్‌చార్జిగా తొలగించాలి ర్యాలీ చేసిన మన్నె రవీంద్ర వర్గీయులు
ఒంగోలు సబర్బన్: గ్రానైట్ ఓవర్‌లోడుతో వాహనాలను నడపరాదని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆర్.సుశీల ఆదేశించారు. ఓవర్ లోడ్ గ్రానైట్ వాహనాలు వేగంగా వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సంబంధిత శాఖాధికారులు మామూళ్ల మత్తులో వాటి గురించి పట్టించుకోవడం లేదు. దీనిపై సాక్షిలో శనివారం ‘‘అవినీతి బండపడా’’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ఒంగోలు రవాణా శాఖ డీటీసీ సుశీల స్థానిక వెంగముక్కల పాలెం రోడ్డులోని డీటీసీ కార్యాలయంలో టిప్పర్, లారీ, ట్రాలీ, క్రషర్ యజమానులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. డైరెక్టర్ మైన్స్ అండ్ జువాలజీ విభాగానికి చెందిన డీడీ టి.రాజశేఖర్‌తో పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీసీ సుశీల మాట్లాడుతూ అధిక బరువుతో వెళుతున్న వాహనాలను అరికట్టడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రామతీర్థం, మర్రిచెట్లపాలెం తదితర ప్రాంతాల నుంచి అధిక బరువుతో భారీ వాహనాల్లో గ్రానైట్, కంకర, బండ రాళ్లు తోలటం వలన రహదారులు పాడవుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని, వాటిని నివారించాలని, వాహనాలు లోడుతో ఉన్నప్పుడు టార్పాలిన్ పట్టలను కచ్చితంగా కట్టాలన్నారు. అలా లేకుంటే వెంటనే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించి ఓవర్‌లోడ్‌తో గ్రానైట్, కంకర, హిల్ రాక్స్, మినరల్స్ ఏదైనా తోలితే కచ్చితమైన చర్యలు, కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మైన్స్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ సురేష్ బాబు, టి.రాజ నాయుడు, రవాణా శాఖ మోటార్ వాహన తనిఖీ అధికారులు ఏ.కిరణ్ ప్రభాకర్, కె.రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్, ఎన్.జగదీష్‌తో పాటు ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.
వీధికెక్కిన టీడీపీ కుమ్ములాటలు
గ్రానైట్ ఓవర్‌లోడుతో రవాణా చేయరాదు
గ్రానైట్ ఓవర్‌లోడుతో రవాణా చేయరాదు


