అడ్డగోలుగా అధికారుల దోపిడీ
గ్రానైట్ ఓవర్ లోడ్ వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. గ్రానైట్ క్వారీలు, ట్రాలీ యజమానుల వద్ద అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అధికారుల అక్రమాలతో ప్రభుత్వానికి నెలకు కనీసం రూ.8 కోట్లకు పైగా నష్టం వస్తోంది. కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే మీ సమస్య పరిష్కారం అయిందని మెసేజ్ వస్తోంది. సమస్య మాత్రం యథాతధంగా ఉంది. ఇటీవల ఓవర్‌లోడుతో వెళుతున్న ట్రాలీని అధికారులు పట్టుకున్నారు. అయితే పెనాల్టీలు మాత్రం వేయకుండా వదిలేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదు.
– గుండా శ్రీనివాసరావు, చీమకుర్తి
ప్రమాదాలు జరగకుండా చూడాలి
పొదిలి–ఒంగోలు రోడ్డులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఓవర్ లోడులతో గ్రానైట్ ట్రాలీలు, టారాస్‌లు, టిప్పర్లు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తుండటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఆటోల్లో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. చీమకుర్తి మండలం రామతీర్థం నుంచి బిల్లులు లేకుండా అధిక లోడులతో వస్తున్న గ్రానైట్ లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాహనాలు తిరిగే రహదారులు, బ్రిడ్జ్‌లు దెబ్బతింటున్నాయి.
– గోగినేని నరేష్ కుమార్, చీమకుర్తి మండలం
అడ్డగోలుగా అధికారుల దోపిడీ


