ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు
వంద రోజుల ప్రణాళిక ఏ విధంగా జరుగుతుందో పరిశీలించడానికి ఇతర శాఖల ఉద్యోగులను నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదు. ఉపాధ్యాయుల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు ఉన్నారు.
– నరహరి అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ
విద్యార్థులు, ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి
వంద రోజులు ప్రణాళికలో భాగంగా పండగ సెలవులు కూడా ఇవ్వకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి పెట్టడం సరికాదు. విద్యార్థులు ఇష్టపడి చదవకుండా కష్టపడి చదివించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. ప్రభుత్వ నిర్ణయాలతో వందశాతం ఫలితాలు ఎలా సాధిస్తారు. ప్రతి రోజు పరీక్షలు నిర్వహించడం, మరుసటి రోజు మార్కులు అప్లోడ్ చేయాలని పేర్కొనడం సరికాదు. విద్యాశాఖపై అవగాహన లేని వ్యక్తులను పర్యవేక్షకులుగా నియమించడం సమంజసం కాదు. ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.
– షేక్ అబ్దుల్ హై, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు


