లోక పావనం
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
క్రీస్తు జననం..
లోక రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మించిన పవిత్రమైన క్రిస్మస్ పర్వదినం కోసం జిల్లాలోని చర్చిలన్నీ ముస్తాబయ్యాయి. పలుచోట్ల క్రీస్తు జనన ఘట్టాలు కళ్లకు కట్టేలా సెట్టింగులు ఏర్పాటు చేశారు. చర్చిలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వాడవాడలా క్రీస్తు రాకడను స్వాగతిస్తూ క్రిస్మస్ స్టార్‌లు ఏర్పాటు చేశారు. చర్చిల్లో బుధవారం రాత్రి క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
– సాక్షి నెట్‌వర్క్
లోక పావనం


